Lava Blaze 5G | దేశీయ మార్కెట్లోకి అత్యంత చౌక 5జీ స్మార్ట్ ఫోన్ గురువారం (నవంబర్ 3) రాబోతున్నది. ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ లావా.. లావా బ్లేజ్ 5జీ పేరుతో ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ – 2022లో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. దేశంలోనే అత్యంత చౌక 5జీ స్మార్ట్ ఫోన్ ఇదని ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర రూ.10 వేల లోపే ఉంటుందని సమాచారం. ట్రిపుల్ రేర్ కెమెరాసెటప్ ఏర్పాటు చేశారు. 50 మెగా పిక్సెల్ (ఎంపీ)లతో కూడిన ప్రైమరీ సెన్సర్ ఇందులో ఉంది. ఇంకా వీడియో కాలింగ్‌తోపాటు సెల్ఫీలు దిగేందుకు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా లభ్యం అవుతుంది.
4జీబీ రామ్ ఆప్షన్లో 1600×720 పిక్సెల్ రిజొల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ ప్యానెల్ ఫీచర్ ఉంది. దీని అంతర్గత స్టోరేజీ సామర్థ్యం 128జీబీకి పెంచారు. 3జీబీ వర్చువల్ రామ్ కూడా లభ్యం అవుతుంది. తద్వారా దీని రామ్ మొత్తం 7జీబీకి విస్తరించొచ్చు. లావా 5జీ బ్లేజ్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇందులో డైమెన్సిటీ 700 ప్రాసెసర్ కూడా అమర్చారు. ప్రీ ఇన్స్టల్డ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ డ్యుయల్ సిమ్, వై-ఫై 6, బ్లూ టూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఫీచర్లు ఉన్నాయి.
మరో ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ నోకియా సైతం 5జీలో జీ60 ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.29,999. 50గా నిర్ణయించింది. ఇందులో 50 మెగా ఫిక్సెల్ ట్రిపుల్ కెమెరా లభ్యం అవుతుంది. 6.58-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది.