న్యూఢిల్లీ : అందుబాటు ధరలో టెక్నో స్పార్క్ 8టీ భారత్‌లో డిసెంబర్ 15 నుంచీ అందుబాటులో ఉండనుంది. ప్రీ ఆర్డర్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో లిస్టయింది. టెక్నో స్పార్క్ 8టీ కోసం అమెజాన్‌లో డెడికేటెడ్ పేజీ ఏర్పాటవగా అందులో స్మార్ట్‌పోన్‌కు సంబంధించి కీలక వివరాలు ఉన్నాయి. టెక్నో స్పార్క్ 8టీ మీడియాటెక్ హెలియో జీ25 చిప్సెట్తో 6.56 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
అట్లాంటిక్ బ్లూ, క్యాన్, కకోవా గోల్డ్, ఐరిష్ పర్పుల్ వంటి నాలుగు కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. టెక్నో స్పార్క్ 8టీ ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వెనుకభాగంలో క్వాడ్ ఫ్లాష్‌తో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగిఉంది. 33డబ్ల్యూ పాస్ట్చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో కస్టమర్ల ముందుకు రానున్న టెక్నో స్పార్క్ 8టీ రూ 10,000లోపు ధర ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.