TECNO POVA Curve 5G | ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అన్నీ ఏఐ ఫీచర్లను అందిస్తున్నాయి. ఫోన్లలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో తయారీ కంపెనీలు కూడా ఏఐ ఫీచర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్నో సంస్థ లేటెస్ట్గా పోవా కర్వ్ 5జి పేరిట ఓ నూతన బడ్జెట్ ఏఐ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.78 ఇంచుల కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తోపాటు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లేపై నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియెంట్లు లభిస్తున్నాయి. ఇందులో ర్యామ్‌ను అదనంగా మరో 8జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే సదుపాయాన్ని కల్పించారు.
టెక్నో పోవా కర్వ్ 5జి స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత హైఓఎస్ 15ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గాను ఆండ్రాయిడ్ 16 అప్ డేట్‌ను అందించడంతోపాటు మరో 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్లో ప్రత్యేకంగా ఎల్లా అనే ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ టెక్నాలజీని యూజర్లకు అందిస్తున్నారు. దీని సహాయంతో బహుళ భాషలకు సపోర్ట్ లభిస్తుంది. ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ ఆటో ఆన్సర్, ఏఐ వాయిస్ ప్రింట్ నాయిస్ సప్రెషన్ అనే ఫీచర్లను ఎల్లా ఏఐ అందిస్తుంది. దీన్నే ఇందులో ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్లో ఏకంగా 5జి ++ కనెక్టివిటినీ పొందవచ్చు. వీవోవైఫై డ్యుయల్ పాస్ అనే ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు.
ఇంటెల్లిజెంట్ సిగ్నల్ హబ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. అందువల్ల నెట్ వర్క్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా మరో సెకండరీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ముందు వైపు 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ కెమెరాల సహాయంతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. క్వాలిటీ అద్భుతంగా వస్తుంది. ఈ ఫోన్‌కు గాను ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా అందిస్తుండడం విశేషం. అత్యంత సన్ననైన స్లీక్ డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. కనుక దీనికి ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ఫోన్ 5500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉండగా దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. చార్జర్ కూడా బాక్స్‌లోనే వస్తుంది. ఫోన్ ను 45 నిమిషాల్లోనే 100 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు. 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా, 8జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.16,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను జూన్ 5 నుంచి విక్రయిస్తారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌ను కొన్నవారు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.