వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కార్గోను మోసుకెళ్తున్న స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన వీడియోను నాసా విడుదల చేసింది. శనివారం ఉదయం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను సమీపించిన సమయంలో ఇది కనిపించినట్లు నాసా చెప్పింది. 3300 కిలోల బరువున్న సరుకులను ఇది మోసుకెళ్తోంది. ఇందులో నిమ్మకాయలు, ఉల్లిగడ్డలు, అవకాడోలు, చెర్రీ టొమాటోలు ఉన్నాయి. ఐఎస్ఎస్లో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్ల కోసం వీటిని స్పేస్ఎక్స్ డ్రాగన్ మోసుకెళ్లింది.
శుక్రవారం ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను లాంచ్ చేశారు. ఫ్లోరిడాలోని నాసా కెనెడీ నుంచి దీనిని లాంచ్ చేసినట్లు ఓ ట్వీట్లో తెలిపింది. ఫాల్కన్ 9 రాకెట్ దీనిని నింగిలోకి మోసుకెళ్లింది. శనివారమే ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌తో డాక్ అయింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్కు డాక్ అవుతున్న సమయంలో నాసా లైవ్ టెలికాస్ట్ చేసింది.
The @SpaceX cargo Dragon flies into orbital daytime as it continues approach to the @Space_Station for docking this morning: pic.twitter.com/AbuLLzrXCq
— NASA (@NASA) June 5, 2021