‘కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందే సినిమాలను ఎంచుకునే సౌకర్యం నాకు ఇంకా రాలేదు. వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకుంటున్నా. విలేజ్ డ్రామాలతో పాటు అర్బన్ స్టోరీస్ చేయాలనుంది’ అన్నారు తిరువీర్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. దుర్గ నరేష్ దర్శకుడు. ఈ సందర్భంగా గురువారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈటీవీ విన్ నుంచి తన సినిమా రావడం ఆనందంగా ఉందని హీరో తిరువీర్ అన్నారు. హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశానని, విజయంపై పూర్తినమ్మకంతో ఉన్నామని దర్శకుడు దుర్గ నరేష్ చెప్పారు. ‘ఇది మామూలు సినిమా కాదు, రాసి పెట్టుకోండి..కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా. విజయం పక్కా’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చక్కటి వినోదంతో పాటు భావోద్వేగాల కలబోతగా సాగే చిత్రమిదని నిర్మాత గడ్డం రాకేష్ రెడ్డి తెలిపారు. పాయల్ రాధాకృష్ణ, రాశి, అజయ్‌ఘోష్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, నిర్మాతలు: గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మదిరెడ్డి, దర్శకత్వం: దుర్గ నరేష్.