ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటితో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల మేలుకలయికగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాను జూలై 3న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు.
ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో విరాట్‌కర్ణ రెండు రకాల గెటప్స్‌లో కనిపిస్తుండటం విశేషం. పోస్టర్ పై భాగంలో శివాంశ సంభూతునిగా శక్తివంతమైన రూపంలో కనిపిస్తున్న విరాట్‌కర్ణ.. పోస్టర్ కిందిభాగంలో మోడ్రన్లుక్లో ైస్టెలిష్‌గా దర్శనమిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయని, రిలీజ్ డేట్ ఖరారు కావడంతో ప్రచారం మరింత వేగవంతం చేయనున్నామని, భారీ నిర్మాణ విలువలతో విలక్షణమైన ఇతివృత్తంతో రానున్న ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని మేకర్స్ తెలిపారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జునైద్ కుమార్-అభే, నిర్మాణం: NIK స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్.