Private space rocket | అంతరిక్షంలోకి మొదటి రాకెట్‌ని ప్రయోగించనున్న స్కైరూట్ ఏరోస్పేస్.. మనదేశంలో మొదటి ప్రైవేట్ స్పేస్ రాకెట్ ఇదే
మనదేశం తరఫున అంతరిక్షంలోకి మొదటి ప్రైవేట్ రాకెట్‌ని పంపనున్న స్కైరూట్ ఏరోస్పేస్
మనదేశంలో ఎప్పుడు రాకెట్ ప్రయోగం జరిగినా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) గుర్తుకొస్తుంది ఎవరికైనా. అలాంటిది మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అంతరిక్షంలోకి రాకెట్‌ని పంపనుంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్కోప్’ ఈ రాకెట్‌ని తయారుచేసింది. ఈ రాకెట్ పేరు ‘విక్రమ్-ఎస్’. నవంబర్ 12 నుంచి 16వ తేదీ మధ్యలో ఈ రాకెట్‌ని ప్రయోగించనున్నట్టు స్కైరూట్ సంస్థ తెలిపింది. అంతరిక్షంలో తమ కంపెనీ మొదటి అడుగుకు గుర్తుగా ఈ మిషన్కి ‘ప్రారంభ’ అనే పేరు పెట్టింది ఈ కంపెనీ. అయితే, 12 నుంచి 16వ తేదీలో ఏరోజు రాకెట్ లాంఛింగ్ చేయాలనేది వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ చందన తెలిపారు. శ్రీహరికోటలోని ఇస్రో లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్‌ని ప్రయోగించనుంది స్కైరూట్.
‘మా తొలి అంతరిక్ష మిషన్ ప్రారంభను మొదలుపెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, మనదేశంలో ప్రైవేట్ స్పేస్ కంపెనీ రాకెట్‌ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. నవంబర్ 12, 16 తేదీల్లో రాకెట్‌ని లాంఛ్ చేయనున్నాం. మా మిషన్ లోగోని ఆవిష్కరించినందుకు ఇస్రో ఛైర్మన్‌కు ధన్యవాదాలు. మాకు అన్నివిధాలా సహకరించినందుకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్‌కి ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసింది స్కైలార్ కంపెనీ. ఈమధ్య స్టార్టప్ కంపెనీలు అన్ని రంగాల్లో కొ్త్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు వస్తున్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

