Smart Phones | ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లమయం.. స్మార్ట్ ఫోన్ లేకపోతే అడుగు ముందుకు పడదు.. అందునా ఇప్పుడు 5జీ కూడా అందుబాటులోకి వచ్చింది. 5జీ కావాలంటే కొత్త స్మార్ట్ ఫోన్ పొందాల్సిందే. ఈ తరుణంలో పలు ఫోన్ల తయారీ సంస్థలు విభిన్న బడ్జెట్ సెగ్మెంట్లలో ఈ నెలలో పలు ఫోన్లను ఆవిష్కరిస్తున్నాయి. ఆ జాబితాలో వన్‌ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్, పొకొ ఎఫ్5, ఫాంటం వీ ఫోల్డ్ 5జీ, అసుస్ రోగ్ ఫోన్7, పొకో ఎక్స్5 5జీ, వివో ఎక్స్90 సిరీస్ ఫోన్లు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మిడ్ రేంజ్ ఫోన్ కొనుగోలు చేయాలని మీరు ఎదురు చూస్తున్నారా.. పలు కొత్త ఆప్షన్లతో బడ్జెట్, చాయిస్ ఆధారంగా మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోవచ్చు. ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చే స్మార్ట్ ఫోన్లపై ఓ లుక్కేద్దామా..!
పొకో ఎఫ్5 ఫోన్ ఈ నెల ఆరో తేదీన ఆవిష్కరించనున్నట్లు తెలుస్తున్నది. అధికారికంగా కంపెనీ ఈ ఫోన్ సంగతి వెల్లడించకున్నప్పటికీ.. లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. అమోల్డ్ డిస్ప్లే, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ వస్తున్నది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ నెల నాలుగో తేదీన `నోర్డ్ సీఈ3 లైట్` అనే ఫోన్‌తో కొత్త ఫోన్ మార్కెట్లోకి తెస్తున్నది. 8జీబీ రామ్ విత్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో వస్తున్నది. అదనంగా 8జీబీ వర్చువల్ రామ్ విస్తరణ సామర్థ్యం దీని స్పెషాలిటీ. 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ కూడా ఉంటుంది. 67 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
మరో ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ టెక్నో.. ఈ నెల 11న `ఫాంటం వీ పోల్డ్ 5జీ` ఫోన్ దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తున్నది. ఇది 50 మెగా పిక్సెల్ +50 మెగా పిక్సెల్ + 13 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమరా సెటప్‌తో వస్తున్నది. 7.85 అంగుళాల 2కే+ ఫోల్డబుల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ నెల 12 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. లాంఛింగ్ ధర రూ.77,777 గా ప్రకటించారు.
అసుస్.. దేశీయ మార్కెట్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లోకి ఈ నెల 13న రోజ్ ఫోన్7 ఫోన్ తెస్తున్నది. ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ కానున్నది. 16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో వస్తున్నది. 165 హెర్ట్జ్ అమోల్డ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో ఈ నెల 14న భారత్ మార్కెట్లోకి పొకో ఎక్స్5 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. 6ఎన్ఎంపై స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తున్నది. ఇది 6.67 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులోకి రానున్నది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్లో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 ఎంపీ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో కెమెరా ఉంటాయి.
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ వివో త్వరలో భారత్ మార్కెట్లో ఎక్స్90 సిరీస్ ఫోన్‌ను ఆవిష్కరించనున్నది. ఎక్స్90, ఎక్స్90 ప్రో, ఎక్స్90 ప్రో+ ఫోన్లను భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తుందన్న సమాచారం వెల్లడించలేదు. లాంచింగ్ డేట్ కూడా బయట పెట్టలేదు.