Samsung Galaxy Z Fold 7 | మడతబెట్టే ఫోన్లను తయారు చేసి అందించడంలో శాంసంగ్ కంపెనీ ఎంతగానో పేరుగాంచింది. ఇప్పటికే ఈ రకానికి చెందిన ఫోన్లను చాలా వరకు ఆ కంపెనీ విడుదల చేసింది. ఇక తాజాగా మరో ఫోల్డబుల్ ఫోన్‌ను శాంసంగ్ రిలీజ్ చేసింది. న్యూయార్క్‌లో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో శాంసంగ్ తన నూతన ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7ను లాంచ్ చేసింది. ఇందులో 8 ఇంచుల ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనికి ముందు వైపు 10 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 6.5 ఇంచుల డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేలు రెండింటిని ఏర్పాటు చేశారు. ఒక్కో డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 200 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. 10 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాను సైతం అమర్చారు. దీనికి 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 30ఎక్స్ స్పేస్ జూమ్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు ఐపీ48 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6తో పోలిస్తే గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7ను 3.2 ఎంఎం తక్కువ మందం, 24 గ్రాముల తక్కువ బరువుతో అత్యంత స్లీక్గా డిజైన్ చేశారు. అందువల్ల చాలా అల్ట్రా మోడ్రన్, ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు.
ఏఐ ఫీచర్లను ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ ఫోన్‌ను రూపొందించారు. ముఖ్యంగా ఫొటోలను ఎడిట్ చేసుకునేందుకు అద్భుతమైన ఏఐ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఫొటో అసిస్ట్ ద్వారా యూజర్లు తమ ఫొటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. పోర్ట్రెయిట్ స్టూడియో, ఎన్హాన్స్డ్ జనరేటివ్ ఎడిట్, సైడ్ బై సైడ్ ఎడిటింగ్, ఆడియో ఎరేజర్ వంటి అధునాతన ఏఐ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్లకు లభిస్తుంది. 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఇతర ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు.
గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 స్మార్ట్ ఫోన్‌ను బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్ బ్లాక్, మింట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,74,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,86,999గా ఉంది. 16జీబీ ర్యామ్, 1టీబీ మోడల్ ధర రూ.2,10,999గా ఉంది. ఈ ఫోన్‌కు గాను ప్రస్తుతం ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించారు. అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.12వేల విలువైన బెనిఫిట్స్‌ను అందిస్తారు. అలాగే 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు.