బుధవారం 21 అక్టోబర్ 2020
Science-technology - Aug 06, 2020 , 12:19:02

శాంసంగ్‌ ‘గెలాక్సీ ఎం31ఎస్’ ఫ్లాష్‌సేల్‌ ప్రారంభం

శాంసంగ్‌  ‘గెలాక్సీ ఎం31ఎస్’ ఫ్లాష్‌సేల్‌ ప్రారంభం

న్యూఢిల్లీ:  సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం  శాంసంగ్ ఎం-సిరీస్‌లో   ‘గెలాక్సీ ఎం31ఎస్’  స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల  భారత్‌లో విడుదల చేసింది.  ఇవాళ్టి నుంచి అమెజాన్‌ ఇండియా, శాంసంగ్‌ వెబ్‌సైట్లలో ఈ ఫోన్‌ సేల్‌ ఆరంభమైంది.   అమెజాన్.ఇన్‌లో గెలాక్సీ ఎం 31ఎస్‌ కోసం 4 మిలియన్లకు పైగా ‘నోటిఫై మి’  అభ్యర్థనలు వచ్చాయని శాంసంగ్ పేర్కొంది. 

స్మార్ట్‌ఫోన్‌ కొన్ని అద్భుత ఫీచర్లను కలిగి ఉన్నది.  వీటిలో 6000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జర్,  6.5 " ఇన్ఫినిటీ-ఓ ఎస్‌అమోలెడ్‌  డిస్‌ప్లే,  64MP ఇంటెల్లి-క్యామ్‌ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,499 కాగా  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.21,499గా నిర్ణయించారు.

సింగిల్‌ టేక్‌ కెమెరా మోడ్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఈ ఫీచర్‌ ద్వారా ఒకేసారి యూజర్లు  ఫొటోలు, వీడియోలు తీసేందుకు వీలవుతుంది. సింగిల్‌ టేక్‌ ఫీచర్‌ శాంసంగ్‌ ప్రీమియం గెలాక్సీ ఫోన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ మిరాజ్‌ బ్లూ, మిరాజ్‌ బ్లాక్‌ కలర్లలో విడుదలైంది. 

స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 6.50 అంగుళాలు

ప్రాసెసర్‌: శాంసంగ్‌ ఎక్సీనోస్‌ 9611

ఫ్రంట్‌ కెమెరా: 32 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 64+12+5+5 మెగా పిక్సల్‌

ర్యామ్‌: 6జీబీ

స్టోరేజ్‌: 128జీబీ

బ్యాటరీ: 6000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10


logo