Samsung Galaxy F04 | దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి గెలాక్సీ ఎఫ్04 ఫోన్ ఆవిష్కరించింది. దేశంలోనే తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఫోన్ ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల ఫోన్. 16.55 సెం.మీ (6.5 అంగుళాల) హెచ్డీ ప్లస్ డిస్ప్లే కల ఈ ఫోన్ జేడ్ పర్పుల్, ఓపల్ గ్రీన్ కలర్స్‌లో లభ్యం అవుతుంది. 4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల శాంసంగ్ ఎఫ్04 ఫోన్ రూ.9,499లకే కొనుగోలు చేయొచ్చు. లాంఛింగ్ ఆఫర్‌గా రూ.7,499లకే అందుబాటులోకి తెస్తున్నది. ఈ నెల 12 నుంచి ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఫోన్‌కు ఏడాది వారంటీ, ఇన్‌బాక్స్ యాక్సెసరీస్‌కు ఆరు నెలల వారంటీ ఉంటుంది.
4జీ / 3జీ / 2జీ సపోర్ట్ డ్యూయల్ సిమ్ + మైక్రో ఎస్డీ కార్డు, 3.5 మి.మీ హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.1, వై-ఫై లభ్యం. జీపీఎస్, ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా లభ్యం. లైట్ సెన్సర్, వర్చువల్ ప్రొగ్జిమిటీ సెన్సర్, యాక్సిలెరోమీటర్ కూడా లభ్యం.