దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానున్నది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్ల మాదిరిగానే బేస్, స్లస్, ఆల్ట్రా మోడల్స్‌లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నది. 6.6-అంగుళాల డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ నాలుగు రంగుల్లో లభించనున్నది. సిల్వర్, వయొలెట్, లైమ్, గ్రాఫైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఆండ్రాయిడ్ 13 విత్ శాంసంగ్ వన్ యూఐ 5.1 వర్షన్ ఆధారంగా పని చేస్తుందీ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తున్నది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్ పుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా 48-మెగా పిక్సెల్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలతో వస్తున్నది. ఈ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే, ఫోన్ ధర ఎంత సంగతి ఇంకా వెల్లడించలేదు.