Samsung Fab Grab Fest 2025 | దసరా పండుగ నేపథ్యంలో శాంసంగ్ ఇండియా ఓ నూతన సేల్‌ను ప్రారంభించింది. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ 2025 పేరిట ఈ సేల్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా శాంసంగ్‌కు చెందిన ఏఐ ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే ఆఫర్లను, భారీ రాయితీలను అందిస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్‌లు, గృహోపకరణాలు, మానిటర్స్ వంటి ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పలు రకాల వస్తువులపై తాజాగా జీఎస్టీ రేట్లను తగ్గించడంతో శాంసంగ్ తన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందిస్తోంది. అందులో భాగంగానే శాంసంగ్ కు చెందిన పలు రకాల ప్రొడక్ట్స్‌పై కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, జడ్ ఫ్లిప్ 7, ఎస్25 అల్ట్రా, ఎస్25, ఎస్25 ఎడ్జ్, ఎస్24 అల్ట్రా, ఎస్24, ఎస్24 ఎఫ్ఈ, ఎ సిరీస్ ఫోన్లపై ఏకంగా 53 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లపై రూ.12వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ బుక్ 5 ప్రొ 360, బుక్ 5 ప్రొ, బుక్ 5 360, గెలాక్సీ బుక్ 5, బుక్ 4 సిరీస్‌కు చెందిన ల్యాప్ టాప్‌లపై రూ.17,490 వరకు తగ్గింపు ధరను అందిస్తున్నారు. అలాగే శాంసంగ్ కు చెందిన గెలాక్సీ ట్యాబ్ ఎస్11 అల్ట్రా, ట్యాబ్ ఎస్11, ట్యాబ్ ఎస్10 ఎఫ్ఈ ప్లస్, ట్యాబ్ ఎస్10 ఎఫ్ఈ, ట్యాబ్ ఎస్10 లైట్, ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ప్లస్, ట్యాబ్ ఎ11 ప్లస్, ట్యాబ్ ఎ11, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్, వాచ్ 8, వాచ్ అల్ట్రా, గెలాక్సీ బడ్స్ 3 ప్రొ, బడ్స్ 3, బడ్స్ కోర్ తదితర ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు ధరను పొందవచ్చు. అలాగే రూ.20వేల వరకు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను సైతం అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌కు చెందిన క్యూలెడ్, నియో క్యూలెడ్, ఓలెడ్ మోడల్ టీవీలపై 51 శాతం వరకు తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఎంపిక చేసిన స్మార్ట్ టీవీలతో ఉచితంగా సౌండ్ బార్‌ను కూడా పొందవచ్చు.
శాంసంగ్ కు చెందిన టీవీలను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. టీవీలపై 30 నెలల వరకు ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. 3 ఏళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఇక శాంసంగ్ కు చెందిన ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తే 46 శాతం వరకు తగ్గింపు ధరను లేదా రూ.5వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ కలిగిన ఫ్రిజ్‌లపై 20 ఏళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఫ్రిజ్‌లకు గాను నెలకు రూ.1290 కి ఈఎంఐ ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో భాగంగా వాషింగ్ మెషిన్లపై 48 శాతం తగ్గింపు ధరను లేదా రూ.2వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. డిజిటల్ ఇన్వర్టర్ మోటర్ ఉన్న వాషింగ్ మెషిన్లపై 20 ఏళ్ల వరకు వారంటీ లభిస్తుంది. ఈ సేల్‌లో శాంసంగ్‌కు చెందిన మైక్రోవేవ్ ఓవెన్లను 39 శాతం తగ్గింపు ధరకు కొనవచ్చు. 10 ఏళ్ల వరకు వారంటీ లభిస్తుంది.
ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌కు చెందిన ఏసీలపై 48 శాతం తగ్గింపు ధరను అందిస్తున్నారు. ఉచిత ఇన్స్టాలేషన్ లభిస్తుంది. 5 ఏళ్ల వరకు వారంటీని ఇస్తున్నారు. ఈ సేల్‌లో శాంసంగ్ మానిటర్లను 59 శాతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. లేదా రూ.5వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ మానిటర్లను కొంటే 27.5 శాతం వరకు లేదా రూ.55వేల వరకు గరిష్టంగా క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మానిటర్లపై 30 నెలల వరకు ఈఎంఐ సదుపాయం లభిస్తుంది. శాంసంగ్‌కు చెందిన ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ 2025 సేల్‌ని శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ తోపాటు శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.