Rooftop Hydrogen Generators | నో పెట్రోల్.. నో డీజిల్.. ఇక నుంచి హైడ్రోజన్‌తో నడవనున్న కార్లు
ఇక నుంచి హైడ్రోజన్‌తో నడవనున్న కార్లు | ఒకప్పుడు ఇంట్లో లైట్ వెలగాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ పవర్ రావాల్సిందే. కానీ.. నేడు ఎన్నో పవర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిసిటీ పవర్ లేకున్నా

ఒకప్పుడు ఇంట్లో లైట్ వెలగాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ పవర్ రావాల్సిందే. కానీ.. నేడు ఎన్నో పవర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిసిటీ పవర్ లేకున్నా.. సోలార్ పవర్ సిస్టమ్ ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంట్లోకి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. రకరకాల జనరేటర్స్ కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే.. అన్నింటికీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ ఉత్పత్తి చేయాలంటే ఖచ్చితంగా ఎండ ఉండాలి. అలాగే.. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను బ్యాటరీలతో స్టోర్ చేయాలి. ఆ బ్యాటరీలు కూడా చాలా తక్కువ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉండటం.. వాటి జీవిత కాలం కూడా చాలా తక్కువగా ఉండటం.. అవి ట్రెడిషనల్ బ్యాటరీలు కావడంతో… ప్రస్తుతం ప్రపంచమంతా ప్రత్యామ్నాయ జనరేటర్స్ కోసం వేచి చూస్తోంది. ఇప్పుడు ప్రపంచం ముందే కాదు.. మన ఇండియా ముందు కూడా కనిపిస్తున్న ఆ ప్రత్యామ్నాయం హైడ్రోజన్ జనరేటర్స్. దాని సెటపే రూఫ్‌టాప్ హైడ్రోజన్ జనరేటర్స్.
రూఫ్‌టాప్ హైడ్రోజన్ జనరేటర్స్ అంటే ఏంటి?
రూఫ్‌టాప్ హైడ్రోజన్ జనరేటర్ అనేది ఒక మిషన్ సెటప్. బిల్డింగ్ మీద టెర్రస్ మీద ఈ మిషన్‌ను సెటప్ చేస్తారు కాబట్టి.. దీన్ని రూఫ్‌టాప్ హైడ్రోజన్ జనరేటర్ అని పిలుస్తున్నారు. ఇది నీళ్ల నుంచి ఎలెక్ట్రాలిసిస్ అనే ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ గ్యాస్‌ను హైడ్రోజన్ జనరేటర్లో స్టోర్ చేసి దాన్ని కార్లకు ఇంధనంగా వాడుకోవచ్చు. గ్యాస్ స్టవ్ కోసం కూడా ఇంధనంగా వాడుకోవచ్చు.
ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని హైడ్రోజన్ జనరేటర్.. నీళ్లలోని అణువులను హైడ్రోజన్ పరమాణువులుగా విచ్చిన్నం చేసే ప్రక్రియనే ఎలక్ట్రాలిసిస్ అంటారు.

హైడ్రోజన్ ఉత్పత్తి కోసం కావాల్సిన ఎలక్ట్రిసిటీని రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ.. ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండానే కేవలం ఫోటాలిసిస్ చేసేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఫోటాలిసిస్ అంటే.. ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ఫోటోఎలక్ట్రోకెమికల్ సెల్స్‌ను ఉపయోగించి సూర్యరశ్మి ద్వారా నీళ్లలో ఉండే హైడ్రోజన్‌ను విచ్చిన్నం చేయడం అన్నమాట.
గత ఆగస్టులో ఐఐటీ మద్రాస్‌కు చెందిన సోలార్ ఎనర్జీ రీసెర్చ్ గ్రూప్ హెడ్ అరవింద్ కుమార్ చందిరన్.. సన్ లైట్ ద్వారా నీళ్లలోని హైడ్రోజన్‌ను విచ్చిన్నం చేసే ప్రక్రియను డెవలప్ చేశారు. అలాగే.. ఫోటోనోడ్ ద్వారా నీళ్లలోని ఆక్సీజన్, హైడ్రోజన్‌ను వేరే చేసే ప్రక్రియను ఐఐటీ గౌహతికి చెందిన ఓ టీమ్ డెవలప్ చేసింది. ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్న నేపథ్యంలో చిన్న సైజులో ప్రతి ఇంటి మీద హైడ్రోజన్ జనరేటర్స్‌ను ఫిక్స్ చేసుకునే రోజులు త్వరలోనే వస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
2030లోపు హైడ్రోజన్ డిమాండ్ 1000 రెట్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్స్‌ను.. ఎనాప్టర్ లాంటి చాలా కంపెనీలు ప్రస్తుతం తయారు చేస్తున్నాయి. ఇప్పటికే హైడ్రోజీనియమ్ రిసోర్సెస్ అనే ఓ కంపెనీ.. రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలర్స్ను తయారు చేసింది. సోలార్ పవర్‌ను ఉపయోగించి ఎలెక్ట్రోలైజర్స్ ద్వారా హైడ్రోజన్‌ను అవి ఉత్పత్తి చేయనున్నాయి.

ధర ఎంత ఉండబోతోంది?
ఎలెక్ట్రోలైజర్ ప్రాసెస్‌కు సంబంధించిన మిషన్ కాస్ట్లీ అయినప్పటికీ.. రూఫ్‌టాప్ హైడ్రోజన్ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌కు ఒక కిలోకు సుమారు రూ.600 పలుకుతోంది. భవిష్యత్తులో హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగితే ఆ ధర కూడా తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వెంటనే ఇలా చేయాల్సిందే.. లేదంటే అన్నీ బ్లాక్ అవుతాయి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే
WhatsApp | 20 లక్షల ఇండియన్ వాట్సప్ అకౌంట్లు బ్యాన్.. మీది బ్యాన్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

