Research bloodcells: రక్తమార్పిడి అవసరాన్ని తగ్గించే రక్తకణాలు.. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేసిన లండన్ పరిశోధకులు
ల్యాబోరేటరీలో తయారుచేసిన ఎర్రరక్తకణాల్ని మనుషులకి ఎక్కించిన లండన్ పరిశోధకులు
కొ్త్త వ్యాక్సిన్ కోసం, కొత్త ఔషధాల కోసం క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని చదివే ఉంటారు. కొత్తరం మందుల్ని, ల్యాబ్‌లో తయారుచేసిన అవయవాల్ని ముందుగా జంతువుల మీద, ఆ తర్వాత మనుషుల మీద ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు పరిశోధకులు. ఈమధ్యే ల్యాబొరేటరీలో తయారుచేసిన రక్తాన్నిక్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఇద్దరు మనుషులకి ఎక్కించారు లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఎర్రరక్తకణాల్ని ల్యాబోరేటరీలో పెంచి మనుషులకి ఎక్కించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ల్యాబరేటరీలో పెంచిన ఎర్రరక్తకణాల జీవితకాలం, దాతల నుంచి సేకరించిన ఎర్రరక్తకణాల కంటే ఎంత ఎక్కువ అనేది తెలుసుకునేందుకు ఈ పరిశోధన చేశారు వీళ్లు. దాతల స్టెమ్ సెల్స్ నుంచి రక్తనాళాల్ని సేకరించి వాటిని ప్రయోగశాలలో పెంచారు. వాటిని తర్వాత ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల శరీరంలోకి ఎక్కించారు.
తక్కువ సార్లు రక్తమార్పిడి
‘రక్తదాతల నుంచి తీసుకున్న ఎర్ర రక్తకణాల కంటే మేము ల్యాబ్‌లో తయారుచేసిర ఎర్రరక్త కణాలు ఎక్కువ రోజులు మెరుగ్గా పనిచేస్తాయని నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ మా క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయితే, తరచూ రక్తమార్పిడి అవసరమైన వాళ్లకు తక్కువ సార్లు రక్తమార్పి చేస్తే సరిపోతుంది’ అని చెప్పారు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన సెడ్రిక్ గ్రెవెర్ట్.
వీళ్లకు వరం
రక్తసంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు ఈ కొత్తరకం రక్తకణాలు వరమని చెప్తున్నారు పరిశోధకులు. సికిల్ సెల్ అనీమియా వంటి సమస్య ఉన్నవాళ్లకు సమయానికి వాళ్ల గ్రూప్ రక్తం దొరకదు. దాంతో, ఈ రక్తకణాల్ని ఎక్కిస్తే, వాళ్ల ప్రాణాల్ని కాపాడొచ్చని చెప్తున్నారు పరిశోధకులు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

