న్యూఢిల్లీ : మొటోరోలా మోటో జీ22 త్వరలో లాంఛ్ కానుంది. నాలుగు రంగుల్లో లభించే హ్యాండ్సెట్ కలర్ ఆప్షన్లతో పాటు ఫీచర్లతో కూడిన ఇమేజ్‌లు ఇటీవల లీకయ్యాయి. మోటో జీ 22 స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి తాజాగా విన్ఫ్యూయర్.డీఈ పలు విశేషాలు వెల్లడించింది.
మోటో జీ22 ఫీచర్ల విషయానికి వస్తే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 6.53 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ వీడియోలను తీసే సామర్ధ్యంతో ఫోన్ ముందు భాగంలో 16ఎంపీ సెల్ఫీ కెమెరా రియర్ భాగంలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. మొటోరోలా మోటో జీ22 మీడియాటెక్ హిలియో జీ37 ప్రాసెసర్‌ను కలిగిఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 10డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది. ఇక మోటో జీ22 ధర, తొలుత ఏ మార్కెట్లో అందుబాటులో ఉంటుందనే వివరాలను వచ్చే నెలలో కంపెనీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.