ప్రపంచవ్యాప్తంగా మొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న జియోమి సంస్థ ఇప్పుడు 5జి ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. జియోమి సంస్థ తమ 5జి ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి జూలై 20కి తెస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. ఫాస్ట్ అండ్ ఫ్యూచరిస్టిక్ అంటూ ట్యాగ్‌లైన్‌తో మంచి పర్ఫార్మెన్స్తో పనిచేస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్య కాలంలోనే జియోమి ఫోన్ రష్యాలో లాంచ్ అయింది. ఇండియాలో లాంచ్ అవ్వబోయే ఫోన్ కూడా అవే ఫీచర్స్‌తో ఉండే అవకాశం ఉంది.
అయితే రష్యాలో లాంచ్ అయిన జియోమి 10టి 5జి మొబైల్ 6.5 అంగుళాల హెచ్డి డిస్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో పంచ్ హోల్ డిస్లేను కలిగి ఉంది. 700 డైమెన్సిటి ప్రాసెసర్‌తో పాటు 6జిబి రామ్, 128 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎమ్ఐయూఐ 12ను రన్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 3 కెమెరాలు ఉన్నాయి. ఒకటి 48 మెగా పిక్సెల్ సెన్సార్, రెండోది 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంటుంది. ఫోన్‌కు 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తూ 5000ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. ఈ మొబైల్లో ఫింగల్ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ స్లాట్, 4జి, ఎన్ఎఫ్సి, డ్యూయల్ బాండ్ వైఫై, బ్లూటూత్ వి5.1, 3.5 ఎంఎం ఆడియో జాక్, సి టైప్ యూఎస్బి పోర్ట్ మొదలగు ఫీచర్స్‌తో ఉంటుంది.
𝗥𝗘𝗗𝗠𝗜'𝗦 𝗙𝗜𝗥𝗦𝗧 #𝟱𝗚 𝗦𝗠𝗔𝗥𝗧𝗣𝗛𝗢𝗡𝗘 𝗜𝗦 𝗔𝗥𝗥𝗜𝗩𝗜𝗡𝗚!
— Redmi India – Redmi Note 11S (@RedmiIndia) July 12, 2021
Brace yourselves for #RedmiNote10T5G, launching on 20.07.2021! ☄️
Step in to a #FastAndFuturistic world soon. ✨
Excited? Get notified & participate in the #contest to win: https://t.co/URaeJH2NoM pic.twitter.com/tB2bKN0P2Z