ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ భారత్‌లో మరో రెండు కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ఫ్రిబవరిలో ఇండియాలో ఎక్స్ 7 సిరీస్‌ను ఆవిష్కరించింది. త్వరలో రియల్మీ X7 Max 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో రిలీజ్కాబోతున్న మూడో ఫోన్ ఇదే. ఎక్స్7 మ్యాక్స్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5జీ చిప్సెట్ ఉంటుంది.
రియల్మీ కంపెనీ 2020లో తన మొట్టమొదటి స్మార్ట్‌టీవీని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరికొత్త రియల్మీ స్మార్ట్‌టీవీ 4కేను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమైంది. రియల్మీ X7 Max 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్మీ స్మార్ట్‌టీవీ 4కేను వర్చువల్ ఈవెంట్లో మే 31న మధ్యాహ్నం 12.30గంటలకు లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్మార్ట్‌టీవీ 43అంగుళాలు, 50 అంగుళాల వేరియంట్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
Get ready to re-imagine the future with #realmeX7Max5G!
— realme (@realmeIndia) May 24, 2021
Xperience the best of streaming, downloading and lag-free gaming with India’s First MediaTek Dimensity 1200 5G Processor.
Now all you want is just a touch away.#FutureAtFullSpeed #LeaderOf5Ghttps://t.co/TEpS9jcjsr pic.twitter.com/hmqYRXVJBV