Realme Swipe Into Summer Sale | స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా. అయితే రియల్‌మి మీకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. రియల్‌మి ఇండియా ప్రత్యేకమైన సమ్మర్ సేల్‌ను నిర్వహిస్తోంది. స్వైప్ ఇన్టు సమ్మర్ పేరిట నిర్వహిస్తున్న ఈ సేల్‌లో భాగంగా పలు రియల్‌మి స్మార్ట్ ఫోన్లపై వినియోగదారులు భారీ ఎత్తున డిస్కౌంట్లను పొందవచ్చు. మే 20 నుంచి ఈ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు రియల్‌మి ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సేల్‌లో భాగంగా రియల్‌మికి చెందిన రియల్‌మి పి3 అల్ట్రా 5జి, రియల్‌మి పి3 ప్రొ 5జి, రియల్‌మి పి3 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5జి ఫోన్లపై భారీ రాయితీలను అందిస్తున్నారు. ఏకంగా రూ.4000 వరకు డిస్కౌంట్‌ను ఈ ఫోన్లపై పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
రియల్‌మి పి3 ప్రొ 5జి ఫోన్ కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999 ఉండగా, తగ్గింపు అనంతరం రూ.19,999కు అందిస్తున్నారు. ఇదే ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.24,999 ఉండగా, ఇప్పుడు రూ.20,999కు అందిస్తున్నారు. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 ఉండగా, రూ.22,999 ధరకు అందిస్తున్నారు. ఈ ఫోన్లు అన్నింటిపై రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. అలాగే రియల్‌మి పి3 అల్ట్రా 5జి ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999గా ఉంది. అయితే దీనిపై రూ.3000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్లను వరుసగా రూ.23,999, రూ.24,999, రూ.26,999 ధరలకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం, రూ.1000 కూపన్‌ను కూడా అందిస్తున్నారు.
రియల్‌మి పి3 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 ఉండగా ప్రస్తుతం దీన్ని రూ.14,999కు అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999 ఉండగా, రూ.15,999 కు ప్రస్తుతం అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,999 ఉండగా రూ.17,999 ధరకు ప్రస్తుతం దీన్ని అందిస్తున్నారు.
రియల్‌మి పి3ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 ఉండగా రూ.2వేలు తగ్గించారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.11,999 ధరకు కొనవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, రూ.12,999కు కొనవచ్చు. అన్ని మోడల్స్‌కు గాను మే 20 నుంచి మే 23వ తేదీ వరకు మాత్రమే ప్రత్యేక సేల్‌ను నిర్వహించనున్నామని రియల్‌మి తెలియజేసింది. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్లైన్ స్టోర్, పలు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.