Realme P4 Power : రియల్‌మి సంస్థ అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఫోన్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రియల్‌మి పీ4 పవర్’ పేరుతో 10,001 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ కలిగిన ఫోన్‌ను గురువారం అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ మార్కెట్లో ఉన్న అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ ఇదే. ఈ ఫోన్ టైటాన్ బ్యాటరీని లేటెస్ట్ జనరేషన్ సిలికాన్ కార్బన్ అండ్ టెక్నాలజీ, సి-ప్యాక్ ప్రొటెక్షన్ బోర్డ్, డ్యుయల్ లేయర్ కోటింగ్ ప్రాసెస్ వంటి అధునాతన ఫీచర్లతో తయారు చేశారు.
దీంతో బ్యాటరీ పనితీరు మరింత మెరుగవుతుంది. 30 శాతం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. దాదాపు ఎనిమిదేళ్లపాటు బ్యాటరీ పని చేస్తుందని కంపెనీ తెలిపింది. నాలుగేళ్లపాటు బ్యాటరీకి కంపెనీ వారెంటీ కూడా ఇస్తుంది. ఐదు నిమిషాలు ఛార్జింగ్ చేస్తే సగం రోజు వాడుకోవచ్చు. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 36 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఫోన్లోని ఇతర ప్రధాన ఫీచర్లివి. 1.5 కే రిజల్యూషన్, 6.78 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 4డీ కర్వుడ్ స్క్రీన్, 219 గ్రాముల బరువు, ప్లగ్ అండ్ ప్లే, రివర్స్ ఛార్జింగ్, మీడియాటెక్ డెమెన్సిటీ 7,400 అల్ట్రా ప్రాసెసర్, 12జీబీ+256జీబీ స్టోరేజ్, 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ట్రిపుల్ కెమెరా (50 ఎంపీ మెయిన్ కెమెరా+ఓఐఎస్+8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 16 విత్ రియల్ మీ యుఐ 7.0 ఓఎస్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్ వంటి ఫీచర్లున్నాయి. ట్రాన్స్ బ్లూ, ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్ వంటి కలర్స్‌లో లభిస్తుంది.
ఈ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 32.5 గంటలపాటు యూట్యూబ్ వీడియో చూడొచ్చు. అలాగే 185.7 గంటలపాటు సంగీతం, 72.3 గంటలపాటు కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ధరలు 8జీబీ+128జీబీ రూ.23,999, 8జీబీ+256జీబీ రూ.27,999, 12జీబీ+256జీబీ రూ.30,999.