Realme P4 5G | పి4 సిరీస్‌లో నూతన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తామని ఇటీవలే రియల్‌మి వెల్లడించింది. అందులో భాగంగానే తాజాగా ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. రియల్‌మి పి4 5జి పేరిట ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్ చాలా వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్లో 6.77 ఇంచుల హైపర్ గ్లో అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. సూర్యకాంతిలోనూ డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్లో 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. హెచ్డీఆర్ 10ప్లస్ టెక్నాలజీకి ఈ డిస్ప్లే సపోర్ట్‌ను ఇస్తుంది.
ఈ ఫోన్లో 7000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. బీజీఎంఐ గేమ్‌ను ఆపకుండా 11 గంటల పాటు నాన్ స్టాప్‌గా ఆడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ బ్యాటరీకి 80 వాట్ల అల్ట్రా చార్జ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 25 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ పూర్తవుతుంది. ఈ ఫోన్లో ఏఐ స్మార్ట్ చార్జింగ్, బైపాస్ చార్జింగ్ అనే ఫీచర్లను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటుంది. ఎక్కువ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీకి రివర్స్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు ప్రత్యేకమైన ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు.
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ లెన్స్ ను సైతం ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ కెమెరాల సహాయంతో 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. అలాగే ఏఐ ఫీచర్లను కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌ను మెటల్ హార్ట్ డిజైన్‌తో రూపొందించారు. అందువల్ల డివైస్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. స్టీల్ గ్రే, ఇంజిన్ బ్లూ, ఫోర్జ్ రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఐపీ65, ఐపీ66 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్‌ను ఈ ఫోన్‌కు అందిస్తున్నారు.
రియల్ మి పి4 5జి ఫోన్‌ను ఆగస్టు 20 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఇండియా ఆన్లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌ను రూ.17,499 ప్రారంభ ధరకు అందించనున్నారు.