Realme : జియోమీ బాటలోనే రియల్మీ.. పెరిగిన రియల్మీ స్మార్ట్ఫోన్ల ధరలు
రియల్మీ స్మార్ట్ఫోన్ల ధరలు | తన రెడ్మీ నోట్ 10 ధరను పెంచిన విషయం తెలిసిందే. జియోమీ తన స్మార్ట్ఫోన్ ధరను పెంచిన మరుసటిరోజే
ఇటీవలే జియోమీ కంపెనీ.. తన రెడ్మీ నోట్ 10 ధరను పెంచిన విషయం తెలిసిందే. జియోమీ తన స్మార్ట్ఫోన్ ధరను పెంచిన మరుసటిరోజే.. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ కూడా స్మార్ట్ఫోన్ల ధరలను పెంచింది. రియల్మీ 8, రియల్మీ 8 5జీ, రియల్మీ సీ11, రియల్మీ సీ21, రియల్మీ సీ25ఎస్ ఫోన్ల ధరలను పెంచింది.

ఈ 5 స్మార్ట్ఫోన్ల ధరలను భారత్లో అదనంగా రూ.1500 వరకు పెంచుతున్నట్టు రియల్మీ ప్రకటించింది. రియల్మీ సీ11(2021) ఫోన్ ధరను రూ.300 పెంచింది. రియల్మీ సీ21, రియల్మీ సీ25ఎస్ ధరను రూ.5000 పెంచింది. రియల్మీ 8, రియల్మీ 8 5జీ ధర రూ.1500 పెంచింది. పెరిగిన ధరలు.. అన్ని ఈకామర్స్ సైట్లలో, రియల్మీ అఫిషియల్ వెబ్సైట్లో కూడా అమలులోకి వచ్చాయి.

పెరిగిన ధర ప్రకారం.. రియల్మీ 8(4 జీబీ ప్లస్ 128 జీబీ) బేసిక్ మోడల్ ప్రస్తుత ధర.. రూ.15,999గా ఉంది. ధరలు పెరగకముందు.. రియల్మీ 8 ధర.. రూ.14,499గా ఉండేది. 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. ఇంతకుముందు.. దాని ధర రూ.16,499గా ఉండేది.

రియల్మీ 8 5జీ ధర ఇప్పుడు రూ.15,499 కాగా.. పెరగకముందు.. రూ.13,999గా ఉండేది. 6జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,499 కాగా.. ఇదివరకు దీని ధర రూ.14,999 గా ఉండేది. టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ మోడల్ దర.. రూ.18,499 కాగా.. ఇదివరకు రూ.16,999 గా ఉండేది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : iPhone 13 : ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్.. ఫోన్లో సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు
Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్
Realme : మీడియాటెక్ ప్రాసెసర్తో రియల్మీ తొలి ఫోన్.. త్వరలో రిలీజ్
Redmi 10 Prime : స్టైలిష్ లుక్తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

