iPhone 13 : ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్.. ఫోన్లో సిగ్నల్ లేకున్నా కాల్స్ చేసుకోవచ్చు
ఐఫోన్ 13లో సరికొత్త ఫీచర్ | గత సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 12 సిరీస్ కంటే కూడా అత్యాధునికమైన ఫీచర్లతో ఐఫోన్ 13 రానుంది
ప్రస్తుతం అందరి చూపు ఐఫోన్ 13 వైపే ఉంది. ఎప్పుడెప్పుడు ఆ ఫోన్ రిలీజ్ అవుతుందా? అని ఐఫోన్ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 12 సిరీస్ కంటే కూడా అత్యాధునికమైన ఫీచర్లతో ఐఫోన్ 13 రానుంది.

ముఖ్యంగా ఐఫోన్ 13లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను యాడ్ చేసింది యాపిల్ కంపెనీ. సెల్‌ఫోన్ నెట్వర్క్ లేని ప్రాంతంలో కాల్స్ చేయాలన్నా.. మెసేజ్ పంపించాలన్నా చాలా కష్టం. సిగ్నల్ లేకపోతే.. ఇంటర్నెట్ కూడా ఉండదు. సెల్‌ఫోన్ టవర్ లేని మూరుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈ సమస్యలు వస్తుంటాయి.
వీటికి చెక్ పెట్టేందుకే.. ఐఫోన్ తాజాగా ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. low earth orbit (LEO) satellite communication connectivity అనే ఫీచర్‌ను ఐఫోన్ 13లో ఎంబెడ్ చేసింది యాపిల్ సంస్థ.

ఈ ఫీచర్ ద్వారా.. సెల్ఫోన్లో 4జీ, 5జీ నెట్వర్క్ సిగ్నల్స్ లేకున్నా కూడా కాల్స్ చేసుకోవచ్చు. మెసేజ్‌లు పంపించుకోవచ్చు. సిగ్నల్స్ లేనిసమయంలో.. శాటిలైట్ ఫీచర్.. డైరెక్ట్‌గా ఎల్ఈవో శాటిలైట్‌కు ఫోన్‌ను కనెక్ట్ చేస్తుంది. దాని నుంచి వచ్చే సిగ్నల్స్‌తో కాల్స్ చేసుకోవచ్చు.
దీనితో పాటు.. క్వాల్కామ్ ఎక్స్ 60 బేస్‌బాండ్ మోడెమ్ చిప్ ఫీచర్‌ను కూడా ఐఫోన్ 13లో అమర్చనున్నారు. ఈ చిప్ ద్వారానే శాటిలైట్‌తో ఫోన్‌కు లింక్ ఏర్పడుతుంది. అప్పుడు శాటిలైట్ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే.. చాలామంది ఐఫోన్ యూజర్లు.. త్వరలో రిలీజ్ చేయబోయే ఐఫోన్ 13కు ఐఫోన్ 2021 పేరును పెట్టాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఐఫోన్ 13 పేరు వద్దు.. ఐఫోన్ 12ఎస్ అని మార్చాలి.. అంటూ సూచిస్తున్నారు.
ఇక.. ఐఫోన్ 13ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 14న ఐఫోన్ 13ను రిలీజ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నా.. యాపిల్ ఇంకా అఫిషియల్‌గా లాంచ్ డేట్‌ను కన్ఫమ్ చేయలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్
Realme : మీడియాటెక్ ప్రాసెసర్‌తో రియల్మీ తొలి ఫోన్.. త్వరలో రిలీజ్
Redmi 10 Prime : స్టైలిష్ లుక్‌తో రానున్న రెడ్మీ 10 ప్రైమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
Vivo X70 : ఐపీఎల్ వేడుకల్లో రిలీజ్ కానున్న వివో ఎక్స్70.. ఫీచర్స్ లీక్
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
iPhone 13 : ఐఫోన్ 13 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

