Realme GT Neo 5 SE | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్మీ తాజాగా రియల్మీ జీటీ నియో 5ఎస్ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 7+ జన్ 2 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్నది. 16 జీబీ రామ్‌తోపాటు గరిష్టంగా ఒక టిగా బైట్స్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటది. 6.74-అంగుళాల 1.5 కే రిజొల్యూషన్ డిస్ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. థర్మల్ మేనేజ్మెంట్ కోసం 4500 ఎంఎం స్క్వేర్ 3డీ టెంపర్డ్ వేపర్ చాంబర్ (వీసీ) కూలింగ్ ఏరియా ఫీచర్ జత చేశారు. 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ చైనా మార్కెట్లో 1999 యువాన్లు (మన కరెన్సీలో దాదాపు రూ.24 వేలు) పలుకుతుంది. 12జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ 2199 యువాన్లు (మన కరెన్సీలో దాదాపు రూ.26,200)లకు లభిస్తుంది. ఇక 12 జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫోన్ 2,299 యువాన్లు (సుమారురూ.27,400), 16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ 2599 యువాన్లు (సుమారు రూ.31 వేలు) పలుకుతుంది. ఈ ఫోన్ ఫైనల్ ఫాంటసీ, పొలార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. చైనాలో ఏప్రిల్ తొమ్మిదో తేదీ నుంచి లభిస్తుంది. ఇతర మార్కెట్లలోకి ఎప్పుడు వస్తుందో వెల్లడించలేదు.
డ్యుయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 13 వర్షన్ విత్ రియల్మీ యూఐ 4.0 వర్షన్ పని చేస్తుంది.
6.74 – అంగుళాల 1.5కే (1,240×2,772 పిక్సెల్స్) డిస్ప్లే విత్ 144హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 360హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ అండ్ 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మ్యాట్రిక్స్ ట్రిపుల్ కెమెరా యూనిట్.
64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.79 అపెర్చర్.
8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ విత్ 112-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అండ్ ఎఫ్/2.2 అపెర్చర్.
2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్ విత్ ఎఫ్/3.3 అపెర్చర్.
సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా @ ఫ్రంట్ విత్ ఎఫ్/2.45 అపెర్చర్.
5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లూనాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్.