realme C85 5G | ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్ ఫోన్లలో తయారీ కంపెనీలు భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందిస్తున్నాయి. బడ్జెట్ ఫోన్లలోనూ ఇలాంటి బ్యాటరీ కెపాసిటీని ఇస్తున్నారు. దీంతో బడ్జెట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్న వారు కూడా సరిగ్గా ఇలాంటి ఫోన్లనే ఎంపిక చేసుకుంటున్నారు. ఇక ఇదే కోవలో తాజాగా రియల్‌మి కూడా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రియల్‌మి సి85 5జి పేరిట ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఇందులో భారీ బ్యాటరీని, అద్భుతమైన డిస్ప్లే, ఇతర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువగానే ఉండడం విశేషం. ఇందులో 6.8 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు.
రియల్‌మి సి85 5జి స్మార్ట్ ఫోన్ ఈ కంపెనీకి చెందిన లేటెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ కాగా సి సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ ఫోన్ కూడా ఇదే కావడం విశేషం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. కనుక ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కాదు. చాలా ఎక్కువ సమయం పాటు ఫోన్ ను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా గేమర్స్‌కు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 10జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఇవ్వగా దీనికి ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ ఫోన్‌కు ఐపీ69 ప్రొ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా లభిస్తుండడం విశేషం. ఈ ఫోన్‌ను మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో రూపొందించారు. అందువల్ల ఫోన్ చాలా క్వాలిటీగా ఉంటుంది. కింద పడినా అంత సులభంగా పగలదు. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ను సాధించిందని, ఈ సెజ్‌మెంట్‌లో ఇలాంటి ఫీచర్లు కలిగిన ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్లో ఏకంగా 7000ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయడం విశేషం. ఈ ఫోన్‌కు ఇదే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ఫోన్‌ను సాధారణంగా వాడితే ఏకంగా 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను సైతం అందిస్తున్నారు. కనుక ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే 6.5 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను కూడా అందిస్తున్నారు. కనుక ఈ ఫోన్ సహాయంతో ఇతర ఫోన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్‌కు కింది వైపు అందిస్తున్న స్పీకర్‌కు గాను ఏకంగా 400 శాతం వరకు వాల్యూమ్‌ను అల్ట్రా మోడ్‌లో పెంచుకునే వీలుందని కంపెనీ చెబుతోంది. అందువల్ల అత్యంత ఎక్కువ వాల్యూమ్‌ను పొందవచ్చు. 4జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ లభిస్తుంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. 5జి సేవలను ఇందులో పొందవచ్చు. అలాగే డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు. రియల్‌మి సి85 5జి స్మార్ట్ ఫోన్‌ను ప్యారట్ పర్పుల్, పీకాక్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,499 ఉండగా, 6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్లకు గాను రూ.500 కూపన్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. కనుక ఆ మేర ఫోన్ ధరపై డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియల్‌మి ఆన్లైన్ స్టోర్, అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.