app instalation | ప్లే స్టోర్ నుంచి గుడ్డిగా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారా?
Cyber trafficking, Women Trafficking, Organ trafficking, cyber crime, cyber fraud, Woman safety, Online cheating, online fraud, cyber crime, cyber fraud, cyber extortion, digital blackmail, cyber attack, cyber blackmail
app instalation | స్మార్ట్‌ఫోన్ అంటేనే యాప్స్.. అన్నంతలా మారిపోయింది టెక్నాలజీ. సర్వీస్, వర్క్, సెర్చింగ్.. ప్రతి పనికీ ఓ యాప్ వచ్చేసింది. దీంతో మోసగాళ్లు కూడా యాప్‌లనే ఆయుధాలుగా చేసుకుంటున్నారు. గుడ్డిగా మనమిచ్చే అనుమతులతో రెచ్చిపోతున్నారు. ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ను సింపుల్‌గా స్కిప్ చేయడం.. గుడ్డిగా ‘ఐ అగ్రీ’ ఆప్షన్‌ను క్లిక్ చేయడం.. వాళ్ల పాలిట వరాలుగా మారుతున్నాయి.
స్మార్ట్‌ఫోన్ కొనుగోలుతోనే ఎవరూ నట్టేట మునగడం లేదు. అందులో ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ గురించి పూర్తిగా తెలుసుకోలేక పోవడమే విపరిణామాలకు మూలం. ఒక్క క్లిక్‌తో.. ఆర్థిక, లైంగిక, మానసిక దోపిడులకు గురవుతున్నారు. ఇన్స్టాల్ చేసుకునే యాప్స్‌లోని భద్రతాపరమైన అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవడం లేదు. నియమ నిబంధనల దగ్గరికి వచ్చేసరికి ‘నేను అంగీకరిస్తున్నాను’ అనే ఆప్షన్ దగ్గర గుడ్డిగా క్లిక్ చేస్తున్నారు.
ఇన్స్టాల్ చేసే ముందు..
గ్యాడ్జెట్ ఏదైనా కానీ.. అందులో యాప్‌ను ఇన్స్టాల్ చేసేముందు దాని సెక్యూరిటీ ఫీచర్స్‌ను కచ్చితంగా తనిఖీ చేయాలి. రివ్యూలలో నిజాయతీని గుర్తించాలి. కొన్ని యాప్స్ నకిలీ సమీక్షలతో మనల్ని తప్పుదారి పట్టిస్తుంటాయి. కాబట్టి, ఇన్స్టాల్ చేసేముందు డౌన్లోడ్ కౌంట్స్ చూడండి. ఏదైనా యాప్‌ను రూపొందించిన ఒకటి రెండు నెలల్లోనే మిలియన్ల కొద్దీ డౌన్లోడ్స్ ఉంటే మాత్రం జాగ్రత్త. అలాంటివాటి జోలికి వెళ్లకండి. ఎందుకంటే తెలియని పబ్లిషర్ నుంచి వచ్చే ఏ కొత్త యాప్ అయినా.. ఒక నెలలో ఐదొందల డౌన్‌లోడ్స్‌కు చేరుకోవడమే గగనం.
అనుమతులు తెలుసుకోండి
మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలనుకున్న యాప్‌కు సంబంధించి.. అనుమతులు కచ్చితంగా తెలుసుకోవాలి. Google Play Store, App Play Store లో ఆ వివరాలు తనిఖీ చేయవచ్చు. అలాగే ‘ఎక్సోడస్’ వెబ్ సైట్‌ను ఉపయోగించి పరిమితులు, అనుమతులు చెక్ చేసుకోవచ్చు. అందుకు https://reports.exodus-privacy.eu.org/en/లో సెర్చ్ చేయండి. యాప్ డెవలపర్స్ సమాచారం కూడా తెలుసుకుంటే మరీ మంచిది. సైబర్ దొంగలు కొన్ని యాప్‌లను క్లోనింగ్ చేసి, లోగోలు మార్చి నకిలీలు రూపొందిస్తారు. ఈ యాప్స్ ఇన్స్టాల్ చేయడంలో అతి కీలకమైన దశ ‘అగ్రీ’, ‘ఐ అగ్రీ’, ‘ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్’ అనే ఆప్షన్లు. అనుమతి విధానం ఒక్కో యాప్‌కు ఒక్కోరకంగా ఉంటుంది. మనం లోతుగా చదవకుండా, ఏ మాత్రం పరిశీలించకుండా.. స్కిప్ చేసి అనుమతి ఇస్తే మాత్రం.. మన వ్యక్తిగత డేటా చోరీకి అంగీకారం తెలిపినట్టు లెక్క. ఒక్క ‘అగ్రీ’ ఆప్షన్ చాలు. యాప్ దుర్వినియోగానికి తలుపులు తెరిచినట్టే. యాప్‌ను ఇన్స్టాల్ చేసే ముందు కచ్చితంగా https://rewordify.com/index.php వంటి సాధనాలను ఉపయోగించాలి.
‘ప్లే ప్రొటెక్ట్’ ఫాలో అవ్వండి!
హానికరమైన ఆండ్రాయిడ్ యాప్స్ నుంచి ఫోన్‌ను రక్షించుకోవాలంటే ‘Google Play Protect’ను ఫాలో కావాల్సిందే. ఇది మీ గ్యాడ్జెట్స్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది. యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి ముందు గూగుల్ ప్లే స్టోర్‌లో భద్రతను చెక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటున్న యాప్‌కు ప్లే ప్రొటెక్షన్ వెరిఫై సింబల్ (లోగో) ఉందో లేదో చూడండి. హానికరమైన యాప్స్, ఇతర మాల్వేర్స్ను అది కచ్చితంగా తొలగిస్తుంది. గూగుల్ ప్లే ప్రొటెక్షన్.. హానికరమైన యాప్‌ల విషయంలో హెచ్చరిస్తుంది. అవసరమైతే డిలీట్ చేస్తుంది. అవాంఛిత మాల్వేర్లను ఇట్టే పట్టేస్తుంది. ఒకవేళ యాప్ డెవలపర్స్ నిబంధనలు ఉల్లంఘించి మన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తే.. గోప్యత పరమైన హెచ్చరికలు జారీచేస్తుంది. కాబట్టే, యాప్‌ను ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ‘ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేషన్’ సరిచూసుకోవాలి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఆన్, ఆఫ్ చేసుకునే వెసులుబాటూ ఉంటుంది. అయితే, మీరు ఎల్లవేళలా ఆన్ చేసుకుంటే మాత్రమే హానికర యాప్స్, మాల్వేర్స్ నుంచి రక్షణ దొరుకుతుంది. యాపిల్ స్టోర్ నుంచి వచ్చే ప్రమాదకర యాప్స్ గురించి ఆందోళన అక్కర లేదు. కారణం యాపిల్ పాటించే కఠిన నిబంధనలే. ఒకవేళ అనుమానం కలిగితే https://support.apple.com/en-in/guide ని సందర్శించండి.
ఈ చిట్కాలు పాటించండి
☞ థర్డ్ పార్టీ యాప్‌లు; గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ (యాపిల్) గుర్తించని యాప్‌లకు దూరంగా ఉండాలి.
☞ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) ఆన్‌లో ఉంచండి.
☞ సోషల్ మీడియా, బ్యాంకింగ్ ఖాతాలు నిర్వహించడానికి టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఫాలో అవ్వండి.
☞ ముఖ్యంగా చిన్న లింక్‌లపై క్లిక్ చేయవద్దు; ఒకవేళ వాటిని కచ్చితంగా చూడాలనుకుంటే https://isitphishing.org ద్వారా వాటిని తనిఖీ చేయండి.
☞ QR కోడ్లను స్కాన్ చేయడం, OTP/MPIN మొదలైనవాటిని షేర్ చేయడం మానుకోండి. వాటి ద్వారానే డబ్బు కొల్లగొడతారు.
☞ కాల్స్ మాట్లాడుతూ స్క్రీన్ షేరింగ్ చేయవద్దు. అందులోనూ బ్యాంకింగ్ లావాదేవీలు వద్దేవద్దు.
☞ మీ ఫోన్‌కు స్ట్రాంగ్ పిన్, పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోండి.
☞ ఎప్పటికప్పుడు మీ యాప్స్‌ను అప్డేట్ చేసుకోండి. పబ్లిక్ వైఫైలకు దూరంగా ఉండండి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read More :
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
అందమైన అమ్మాయిల నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయా?
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

