మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
Cyber Crime Prevention Tips | న్యూడ్ చాలెంజ్ పేరుతో ఇంట్లోవాళ్లవి, బంధువుల ఫొటోలు అప్లోడ్ చేసే చాలెంజ్ ఇచ్చారు. నాలాగే కొందరు తెలియక వాటిని ఆ సైబర్ దొంగకు అప్లోడ్ చేశారు. నాకు మనసొప్పలేదు.
Cyber Crime Prevention Tips | లాక్డౌన్లో ఆన్లైన్ క్లాస్‌లు ప్రారంభమైనప్పటి నుంచీ సాకేత్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. చదివేది ఇంటరే అయినా.. ఎప్పుడూ సెల్ ఫోన్‌తోనే. ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టలేకపోతున్నాడు. అర్ధరాత్రి వరకు అదే కాలక్షేపం. బిడ్డ చదువుకుంటున్నాడేమో అనుకుంటుంది తల్లి. కొన్ని నెలల నుంచీ తిండి మానేశాడు. సాకేత్‌ను తెలియని భయం ఆవహించినట్టు గుర్తించింది తల్లి. ఓ రోజు ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేసింది. తల్లి దగ్గరికి రావడాన్ని గమనించిన సాకేత్.. ఫోన్ తీసుకొని పరుగు లంకించుకున్నాడు. ఎలాగైనా సాకేత్‌తో మాట్లాడాలనుకున్న తల్లి.. అర్ధరాత్రి తర్వాత డోర్ కొట్టింది. తల్లిని చూడగానే భోరున విలపించాడు. ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు ఆమెకు. కొడుకును ఓదారుస్తూ.. మెల్లగా విషయం రాబట్టింది. తన ఫోన్ అన్‌లాక్ చేసి తల్లిముందు పెట్టాడు.. ఇంట్లోవాళ్లు స్నానం చేస్తున్న దృశ్యాలు, బట్టలు మార్చుకునే ఫొటోలు. గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. ఆ బాధను పంటిబిగువున దాచుకుంది. ఆవేశంతో చెంప చెళ్లుమనిపించింది తల్లి. ‘కొట్టడం కాదు.. నన్ను చంపెయ్ మమ్మీ’ అంటూ కాళ్లమీదపడ్డాడు సాకేత్. ‘వాడు.. వాడు..’ అంటూ వెక్కిళ్లుపట్టిన గొంతుతో మాట్లాడ్డం ప్రారంభించాడు.

లాక్డౌన్లో వీడియో గేమ్ ఆడుతుంటే.. ఒకడు పరిచయమయ్యాడు. ఆన్లైన్లోనే ఓ కొత్త బ్యాచ్‌ను పరిచయం చేశాడు. వాళ్లు మరికొన్ని థ్రిల్లింగ్ గేమ్స్ ఆడించారు. వాటికి అలవాటుపడ్డాను. ‘న్యూడ్ చాలెంజ్’ పేరుతో ఇంట్లోవాళ్లవి, బంధువుల ఫొటోలు అప్లోడ్ చేసే చాలెంజ్ ఇచ్చారు. నాలాగే కొందరు తెలియక వాటిని ఆ సైబర్ దొంగకు అప్లోడ్ చేశారు. నాకు మనసొప్పలేదు. చచ్చిపోవాలనుకుంటున్న టైమ్‌లో నువ్వొచ్చావు మమ్మీ’ అంటూ పశ్చాత్తాప హృదయంతో తల్లికి జరిగింది వివరించాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు ఉదయమే సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లింది. ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నాడు. కొన్నివారాల పాటు చికిత్స అందించాడు. ఒకవైపు తల్లి, మరోవైపు సైకియాట్రిస్ట్.. ఇద్దరూ ధైర్యం నూరిపోశారు. ఆ ఫోన్‌తో సహా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఫోన్ డేటా ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆ దొంగను కటకటాలకు పంపారు. ఇలా దిక్కుమాలిన చాలెంజ్‌లకు అలవాటుపడుతున్న బ్యాచ్‌లను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

నిఘా ఎందుకంటే..?
స్మార్ట్‌ఫోన్ రాకతో డిజిటల్ స్వేచ్ఛ పెరిగింది. అయితే ఫోన్‌ను ఎంత జాగ్రత్తగా, భద్రంగా చూసుకున్నా.. డేటా చోరీ అవుతున్నది, సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నది. ముఖ్యంగా టీనేజ్ బాలలు సులభమైన టార్గెట్ అవుతున్నారు. వీడియోగేమ్స్ మధ్యలో న్యూడ్ ఫొటోలు, వీడియోలు చూపించి బుట్టలో వేసుకుంటున్నారు. దీనివల్ల పిల్లలు పక్కదారి పడుతున్నారు. ఆ అమాయకులను మరింత రెచ్చగొడుతూ అర్థంలేని చాలెంజ్‌లు విసురుతారు. మెల్లిగా తమ దారికి తెచ్చుకుంటారు. తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు యాడ్ చేయించి, ఓటీపీలు తెలుసుకొని తెలివిగా డబ్బులు వసూలు చేస్తారు. ఒక్కోసారి పిల్లలు పోర్న్ చూస్తున్నప్పుడు కెమెరా యాక్సెస్ తీసుకొని.. ఆ వీడియోలు రికార్డ్ చేస్తారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే స్నేహితులు, బంధువులకు పంపుతామంటూ బెదిరిస్తారు. కొందరు పిల్లలతో అయితే సాక్షాత్తు కుటుంబ సభ్యుల నగ్న, అర్ధనగ్న ఫొటోలు తీయిస్తారు. వాటిని బాధితులకు పంపి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇదంతా ఒక మాయా ప్రపంచం. తెలివిగా లేకపోతే కుటుంబ పరువు బజారునపడటం ఖాయం. ఆత్మహత్యలు చేసుకునే స్థితికీ రావొచ్చు. కాబట్టి, మీ పిల్లల ఫోన్లపై ఓ కన్నేయండి. ఎవరైనా బాధితులు ఉంటే మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించండి.

తల్లిదండ్రులూ వింటున్నారా?
» పిల్లల డెబిట్, క్రెడిట్ కార్డులకు పరిమితులు విధించండి. దీంతో నష్టం చాలా తక్కువగా ఉంటుంది.
» సురక్షితం కాని యాప్‌ల నుంచి కొనుగోళ్లు చాలా ప్రమాదకరం. ఆఫర్లు, బోనస్ పాయింట్లు, రివార్డు పాయింట్లు అంటూ పిల్లల్ని మరింత లోబర్చుకుంటారు.
» పిల్లలు నెట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు? ఏఏ సైట్లు ఓపెన్ చేస్తున్నారు? అని తెలుసుకునేందుకు వెబ్సైట్ హిస్టరీని తనిఖీ చెయ్యండి. ఇబ్బందికరమైన సైట్లు ఓపెన్ చేస్తే సున్నితంగా హెచ్చరించండి.
» మీ పిల్లలు తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్లైన్ ప్రపంచంలోకి అడుగుపెడితే.. ప్రమాదాల గురించి వివరంగా చెప్పండి. ఆన్లైన్లో సమాచారాన్ని పంచుకునే విధానంపై చర్చించండి. సైబర్ నేరగాళ్ల గురించి, సరికొత్త మోసాల గురించి అవగాహన కల్పించండి. ప్రతీక్షణం విచక్షణతో ఉండమని సలహాలు ఇవ్వండి.
» మీ పిల్లలు ఏదైనా ఆన్లైన్ గేమ్, వెబ్సైట్లకు సైన్ అప్ అయ్యేటప్పుడు కుటుంబంలోని పెద్దల మెయిల్ ఇవ్వండి.
» పిల్లలు గూగుల్‌లో సెర్చ్ చేసేముందు ‘సేఫ్సెర్చ్’ గురించి అవగాహన కల్పించండి. యుక్త వయసు పిల్లల కోసం గూగుల్‌లో www.kiddle.coను ఉపయోగించండి.
» పిల్లలకు ఇప్పటికే ఏదైనా ఇబ్బంది ఉంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యండి.
(వచ్చేవారం డిజిటల్ పేరెంటింగ్ పార్ట్ -2)
– అనిల్ రాచమల్ల, ఎండ్‌నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
“Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్‌కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి”
“నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

