Cyber fraud helpline number|24 గంటల్లోపు ఈ నంబర్‌కు కాల్ చేస్తే పోయిన డబ్బులు వచ్చేస్తాయి
cyber fraud helpline number | మీరు సైబర్ మాయగాళ్ల చేతుల్లో మోసపోయారా..?.అయితే వేగంగా స్పందించండి…24 గంటల్లోపు ఫిర్యాదు చేయండి.
cyber fraud helpline number | ‘మీరు సైబర్ మాయగాళ్ల చేతుల్లో మోసపోయారా..?.అయితే వేగంగా స్పందించండి…24 గంటల్లోపు ఫిర్యాదు చేయండి. పోలీసులకు లేదా డయల్ 100కు లేదా 155260కు అయినా సరే…మీ డబ్బు కచ్చితంగా వెనక్కి వస్తుంది. నిర్దేశించిన సమయంలో ఫిర్యాదు చేస్తే.. ఆ డబ్బును సైబర్ మాయగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఆపుతారు. ఇందుకోసం కేంద్ర హోం శాఖ 155260 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పోయిన నగదు మళ్లీ తిరిగి పొందవచ్చు.

cyber fraud helpline number ( 155260 )కు ఫోన్ చేసి సైబర్ క్రైం నేరం జరిగిందని చెప్పగానే వెంటనే ప్రాంతం..ఫోన్ నంబర్, బదిలీ అయిన ఖాతాల నంబర్లు, యూపీఐడీ నంబర్లు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫాం ఖాతాల నంబర్లను ఈ ఫోన్‌ను స్వీకరించే నోడల్ అధికారికి చెప్పాలి. వెంటనే ఆ బ్యాంక్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫాం ఖాతాల సంస్థలకు సమాచారాన్ని పంపించి.. ఆ ఖాతాలు.. వాటి నుంచి బదిలీ అయిన అకౌంట్ల లావాదేవీలను నిలిపివేస్తారు. అందులో ఉండే నగదును వెంటనే ఫ్రీజ్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో తిరిగి ఏ ఖాతా నుంచి వెళ్లాయో అందులోకే డబ్బులు వచ్చే విధంగా చేస్తారు. బాధితులకు ఈ నంబర్ గుర్తుకు లేకున్నా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా.. నిలుపుదల ప్రక్రియ వేగంగా జరిగిపోతుంది.

రూ. 75 లక్షలు వెనక్కి వచ్చాయి..
కేంద్రం ప్రవేశపెట్టిన 155260 నంబరుతో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారు రూ. 75 లక్షలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఆపగలిగారు. రెండున్నర నెలలో మొత్తం 2 కోట్లకు పైగా నగదును బాధితులు పోగొట్టుకున్నారు. కొందరు బాధితులు 24 గంటల్లోపే పోలీసులను ఆశ్రయించారు. వెంటనే 155260కు వివరాలు తెలుపగా, దాదాపు రూ. 50 లక్షలు తిరిగి బాధితుల ఖాతాల్లోకి వాపసు వచ్చేలా చేశారు. మిగతా రూ. 25 లక్షల నగదు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో ఫ్రీజ్ చేశారు.

అవగాహన పెంచుకోండి
సైబర్ మాయగాళ్ల మాటలకు బోల్తా పడకండి. గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు డబ్బులను పంపించకండి. ఒకవేళ మోసపోతే 24 గంటల్లో ఫిర్యాదు చేయండి. మీ డబ్బు తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే మాత్రం పైసా తిరిగి రాదు. కాబట్టీ మోసాలపై అవగాహన పెంచుకోండి. ఎవరికీ, ఎందుకు, ఎక్కడకు ఈ డబ్బును పంపిస్తున్నామని తెలుసుకోండి. ఒక వేళ నగదు పంపించి..తర్వాత ఆలోచిస్తే.. వెంటనే డయల్ 100 లేదా 155260కు ఫోన్ చేయండి. ఆలస్యం చేయకండి..ఈ నంబరును గుర్తు పెట్టుకోండి.
– హరినాథ్, ఏసీపీ, రాచకొండ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?
నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో మోసాలు.. మిమ్మల్ని డబ్బులు అడిగేది మీ ఫ్రెండేనా కాదా ఇలా గుర్తించండి
cyber fraud helpline number
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

