e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎవర్‌గ్రీన్‌ గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?

గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?

గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?

హైదరాబాద్ ,మే 2: ఇంటర్నెట్‌లో పలు రకాలైన ఫోటోలను చూస్తూనే ఉన్నాము. అయితే ఇది నిజమా.. ? కాదా అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్‌ తో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు. ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా జరుగుతున్నది. అటువంటప్పుడు ఆయా ఫొటోలు ఒరిజినలా..? కాదా..? అనేది తెలుసుకోవాలంటే ఇలా చేయాలి.

గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?

గూగుల్‌ సెర్చ్‌ ద్వారా …

మీ ఆండ్రాయిడ్‌ పరికరంలో గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడానికి మీరు రివర్స్‌ సెర్చ్‌ చేయాలనకుంటున్న ఫోటోలను సెలెక్ట్ చేసి దానిమీద రైట్‌ క్లిక్‌ చేసి ఇవ్వండి. అప్పుడు మీరు సెర్చ్‌ గూగుల్‌ ఫర్‌ ఇమేజ్‌ క్లిక్‌ చేస్తే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది.

గూగుల్‌ ఇమేజెస్‌ ద్వారా…

ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్‌ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్‌. గూగుల్‌లో మనకు కనిపించే ఫోటోలు నిజమా..? కాదా…? అనేది గూగుల్‌ ఇమేజెస్‌ మనకు రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్‌ వెతికినప్పుడు ఆ ఇమేజ్‌ విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే గూగుల్‌ ఇమేజెస్‌కు వెళ్లి కెమెరా ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి. మీరు చూసిన ఫోటో యూఆర్‌ఎల్‌ లేదా ఆ ఫోటోను నేరుగా అప్లోడ్‌ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో.. దాని మూలం ఎక్కడిదో సూచిస్తుంది.

Advertisement
గూగుల్‌లో ఫేక్ ఫోటోలను ఎలా గుర్తించాలి…?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement