Poco C51 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్‌బ్రాండ్ పొకో.. భారత్ మార్కెట్లోకి ‘సీ51’ ఫోన్ ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్‌పై పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. పొకో సీ-సిరీస్ ఫోన్లలో వర్చువల్‌గా 7జీబీ రామ్ సపోర్ట్ లభిస్తుంది.
సింగిల్ వేరియంట్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల సీ51 ఫోన్ ధర రూ.8,499 మాత్రమే. స్పెషల్ ఫస్ట్ డే సేల్స్ సందర్భంగా రూ.7,799లకే లభిస్తుంది. కొనుగోలుదారులు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫిప్ల్‌కార్ట్ ఇండియా ద్వారా ఈ నెల 10 నుంచి కొనుగోలు చేయొచ్చు. రాయల్ బ్లూ, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
పొకో సీ 51 ఫోన్ 6.52-అంగుళాల హెచ్డీ ఫ్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఆన్ ఎల్సీడీ ప్యానెల్ విత్ యాస్పెక్ట్ రేషియో 20:9. ఇది 120 హెర్ట్ టచ్ శాంప్లింగ్ రేట్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే రిజొల్యూషన్ 1600720 పిక్సెల్స్.
ఓక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తుంది. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఎఫ్/ ఎఫ్2.2 అపెర్చర్. 5-మెగా పిక్సెల్ ఫ్రంట్ సెన్సర్‌తో సెల్ఫీలు, వీడియో కాలింగ్ చేయొచ్చు.
డ్యూయల్ 4జీ ఓల్ట్, వై-ఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం యాక్సెలోమీటర్, ఫింగర ప్రింట్ సెన్సార్ ఉంటాయి. ఇది 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల పోర్టబుల్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. దీంతోపాటు 10 వాట్ల మైక్రో యూఎస్బీ చార్జర్ కూడా ఇస్తారు.