న్యూఢిల్లీ : హాట్ డివైజ్ పోకో ఎక్స్5 ప్రోపై (Poco X5 Pro) ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. భారత్‌లో ఈ 5జీ ఫోన్‌ను రూ. 22,999 ప్రారంభ ధరకు లాంఛ్ చేయగా ప్రస్తుతం ధర రూ. 19,999కి తగ్గింది. దీంతో పోకో ఎక్స్5 ప్రో కొనుగోలుదారులకు రూ. 3000 డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకూ అందుబాటులో ఉంటుందనే వివరాలు వెల్లడికాలేదు.
ఈ ధరలో పోకో ఎక్స్5 ప్రో పలు హాట్ ఫీచర్లతో లభిస్తుండటం కస్టమర్లను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పోకో స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఫాస్ట్ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తోంది. రూ. 20,000లోపు ఫోన్లలో ఏ బ్రాండ్ ఇలాంటి చిప్‌సెట్‌ను ఆఫర్ చేయకపోవడం గమనార్హం.
67డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్‌తో మెరుగైన బ్యాటరీ లైఫ్ కలిగిఉంది. కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్‌ను ఆఫర్ చేస్తోంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ వైడ్‌యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో 4కే వీడియోలను షూట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
Read More :