Honor 90 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హానర్’.. భారత్ మార్కెట్లోకి తన హానర్ 90 5జీ (Honor 90 5G)తో రీ ఎంట్రీ ఇచ్చింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్, 66వాట్ల వైర్డ్ సూపర్ చార్జ్ టెక్నాలజీతో 5000-ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. త్రీ స్టోరేజీ వేరియంట్లు, త్రీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 200-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. భారత్‌లో రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది.
హానర్ 90 5జీ ఫోన్ (Honor 90 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.37,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.39,999లకు లభిస్తుంది. ఎర్లీ బర్డ్ సేల్స్ కింద రూ.27,999, రూ.29,999లకు లభిస్తాయి.
ఈ నెల 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కంపెనీ అధికారిక వెబ్సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్స్ ప్రారంభం అవుతాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.2000 డిస్కౌంట్ అందిస్తున్నది అమెజాన్. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ ఖాతాదారులకు రూ.3000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ క్లయిమ్ చేసిన వారు కొత్త ఫోన్ కొనుగోలు చేసిన నెల లోపు తమ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
హానర్ 90 5జీ (Honor 90 5G) ఫోన్ 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే విత్ 1.5 కే రిజొల్యూషన్ (2664×1200 పిక్సెల్స్) అండ్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటది. ఈ ఫోన్ పీక్ బ్రైట్ నెస్ 1600 నిట్స్ తో వస్తున్నది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ మ్యాజిక్ ఓఎస్ 7.1 వర్షన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
200-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ హానర్ ఇమేజ్ ఇంజిన్ సపోర్ట్, ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో 12 మెగా పిక్సెల్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ మాక్రో లెన్స్‌తోపాటు 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటాయి.
బయో మెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్నది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది.