Poco M7 Plus 5G | పోకో ఎం7 ప్లస్ పేరిట పోకో కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎం సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ పోకో ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇందులో 6.9 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. అదనంగా మరో 8జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో సెకండరీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత హైపర్ ఓఎస్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు గాను 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇదే దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. చాలా తక్కువ ధరలోనే ఇంత భారీ బ్యాటరీ లభిస్తున్న ఫోన్ ఇదే కావడం విశేషం. అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పటికీ ఈ ఫోన్ తక్కువ మందాన్ని కలిగి ఉంటుంది. కేవలం 8.4 ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఈ సెజ్మెంట్లోనూ ఇదే మొదటి ఫోన్ కావడం విశేషం.
ఈ ఫోన్ బ్యాటరీ 144 గంటల వరకు ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లే బ్యాక్‌ను అందిస్తుందని, 27 గంటల వరకు సోషల్ మీడియాను వాడుకోవచ్చని, 12 గంటల వరకు జీపీఎస్ నావిగేషన్‌ను వాడుకోవచ్చని, 24 గంటల వరకు వీడియోలను చూడవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు గాను 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను సైతం అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే 18 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ కు కూడా ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌ను అందిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది.
ఈ ఫోన్‌కు ఐపీ64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం ఇందులో అందిస్తున్నారు. పోకో ఎం7 ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్‌ను క్రోమ్ సిల్వర్, ఆక్వా బ్లూ, కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఆగస్టు 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డులతో ఈ ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.1000 అదనపు డిస్కౌంట్ ఇస్తారు. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.