Poco C55 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీసంస్థ పొకో.. భారత్ మార్కెట్లో పొకో సీ 55 ఫోన్ ఆవిష్కరించ నున్నది. ఈనెల 21 మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తుంది. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. గత నెలలోనే చైనా మార్కెట్‌ను తాకిన పొకో సీ55 ఫోన్లో మీడియా టెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్సెట్ ఉంటుందని భావిస్తున్నారు. మూడు స్టోరేజీ వేరియంట్లతో చైనాలో ఆవిష్కరించిన పొకో.. గ్లోబల్ మార్కెట్లోనూ ఆ వేరియంట్లను తీసుకొస్తుందని భావిస్తున్నారు.
రెడ్మీ 12 సీ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పొకో సీ55 పేరుతో ఆవిష్కరిస్తారని ఇంతకుముందు వార్తలొచ్చాయి. గత నెలలో చైనాలో రెడ్మీ సంస్థ సీ-సిరీస్ బడ్జెట్ ఫోన్లను ఆవిష్కరించింది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 4జీబీ రామ్ విత్ 128 ఇంటర్నల్ స్టోరేజీ, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో విడుదల చేసింది. షాడో బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్ కలర్స్‌లో అందుబాటులోకి వచ్చింది.