న్యూఢిల్లీ : ఒప్పో వాచ్ 3 ఈ ఏడాది ఆగస్ట్‌లో లాంఛ్ కానుంది. ఒప్పో లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ క్వాల్‌కాం న్యూ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5+ చిప్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. ఒప్పో వాచ్ 2 తరహాలోనే ఒప్పో వాచ్ 3 డిజైన్ ఉంటుందని భావిస్తున్నారు. న్యూ చిప్‌తో ఒప్పో, మొబ్వై రానున్నాయని క్వాల్‌కాం వెల్లడించింది.
లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ 5 వేరబుల్ ప్లాట్‌ఫాం స్మార్ట్ వేరబుల్ టెక్నాలజీని సరికొత్త స్ధాయికి తీసుకువెళుతుందని ఒప్పో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఐఓటీ బిజినెస్ ప్రెసిడెంట్ ఫ్రాంకో లి పేర్కొన్నారు. స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ 5 చిప్సెట్తో రానున్న తొలి స్మార్ట్‌వాచ్‌గా ఒప్పో వాచ్ 3 సిరీస్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని అన్నారు.
అప్‌కమింగ్ ఒప్పో వాచ్ అంతకుముందు ఒప్పో స్మార్ట్‌వాచ్ వెర్షన్ల తరహాలో స్క్వేర్ డయల్‌ను కలిగిఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ట్రాకింగ్, స్టెప్ ట్రాకింగ్ వంటి పలు హెల్త్ ఫీచర్లతో రానుందని చెబుతున్నారు. ఒప్పో స్మార్ట్‌వాచ్ 3 సిరీస్ కస్టమర్ల స్లీపింగ్ ప్యాట్రన్స్‌ను కూడా ట్రాక్ చేయనుంది.