Oppo | ఒప్పో రెనో 8..రెనో 8 ప్రొ 5జీ హాట్ ఫీచర్లు ఇవే!
ఈ నెలాఖరులో లాంఛ్ అవుతుందని భావిస్తున్న ఒప్పో రెనో 8 సిరీస్ స్పెసిఫికేషన్లు, భారత్‌లో స్మార్ట్ఫోన్ల ధర వంటి వివరాలు లీక్ అయ్యాయి.
న్యూఢిల్లీ : అధికారిక లాంఛ్‌కు ముందే ఒప్పో రెనో 8 సిరీస్ స్పెసిఫికేషన్లు, భారత్‌లో స్మార్ట్ఫోన్ల ధర వంటి వివరాలు లీక్ అయ్యాయి. భారత్‌లో ఒప్పో రెనో 5జీ ధర రూ 29,990 నుంచి ప్రారంభమవుతుందని ఏ రూట్మైగెలాక్సీ రిపోర్ట్ వెల్లడించింది. లీకయిన ధర నిజమైతే ఒప్పో రెనో 5జీ మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ, పోకో ఎఫ్4 5జీ, షియామి 11ఐ హైపర్‌చార్జ్, ఐక్యూఓఓ నియో 6 5జీవంటి ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.
ఒప్పో రెనో 8, రెనో 8 5జీ స్మార్ట్ఫోన్లు బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి. రెనో 8 సిరీస్ ఫోన్లు జులై 24 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. రెనో 8 5జీతో పాటు భారత్‌లో రెనో 8 ప్రొ 5జీని కూడా లాంఛ్ చేసేందుకు ఒప్పో సన్నద్ధమైంది. ఈ ఫోన్ భారత్‌లో రూ 42,000 నుంచి రూ 46,000 మధ్య లభిస్తుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ పేర్కొన్నారు.
రెనో 8 ప్రొ 5జీ 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లేతో పాటు వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా ఆకట్టుకోనున్నాయి. సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగిఉంది. ఇక రెనో 8 5జీ, రెనో 8 ప్రొ 5జీ స్మార్ట్ఫోన్లు 80డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

