Oppo Reno 15: ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో నుంచి రెనో 15 సిరీస్ ఫోన్లు ఈ నెల 8న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తోపాటు ఒప్పో అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఈ సిరీస్ లో భాగంగా ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రొ, ఒప్పో రెనో 15 ప్రొ మినీ అనే మూడు 5జీ వేరియంట్లను కంపెనీ లాంఛ్ చేయనుంది.
ఈ ఫోన్లలో కెమెరాపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒప్పో రెనో 15 ప్రొ, ఒప్పో రెనో 15 ప్రొ మినీ ఫోన్లలో 200 ఎంపీ కెమెరా ఉండనుంది. దీంతోపాటు 50 ఎంపీ టెలీఫొటో కెమెరా కూడా ఉండనుంది. 3.5 x జూమ్, 50 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఫోన్లతో సెకండుకు 60 ఫ్రేములతో 4కే వీడియో కూడా తీయొచ్చు. ఈ కెమెరాల్లో మరో అప్డేట్ సాఫ్ట్ వేర్ ఆధారిత టూల్స్. వీటి ద్వారా ఫొటోల్ని మరింత అందంగా, క్లారిటీగా తీసుకోవచ్చు.
ఇక రెనో 15 సిరీస్ ఫోన్ల ధర రూ.50 వేల లోపే ఉండొచ్చని తెలుస్తోంది. అందులోనూ రెడో ప్రో మినీ ధర రూ.40 వేల లోపే ఉండొచ్చని అంచనా. ధర, పూర్తి ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ నెల 8 వరకు ఆగాల్సిందే.