Oppo Reno 14 | వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించడంలో ఈ మధ్య కాలంలో ఒప్పో చాలా పేరుగాంచింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు తన వాటాను కూడా పెంచుకుంటూ వస్తోంది. అందులో భాగంగానే యూజర్లకు నచ్చేలా మరో నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఒప్పో రెనో 14 పేరిట ఈ ఫోన్ లాంచ్ అవగా ఇందులోనే రెనో 14 ప్రొ పేరిట మరో వేరియెంట్‌ను కూడా ఒప్పో లాంచ్ చేసింది. రెనో 14 స్మార్ట్ ఫోన్లో 6.59 ఇంచుల డిస్ప్లే ఉండగా, ప్రొ మోడల్లో 6.83 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ రెండు డిస్ప్లేలు కూడా 1.5కె రిజల్యూషన్‌ను కలిగి ఉండడంతోపాటు ఇవి అమోలెడ్ డిస్ప్లేలు కావడం విశేషం. అందువల్ల ఈ ఫోన్ల డిస్ప్లేలు చాలా క్వాలిటీగా ఉంటాయి. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
ఒప్పో రెనో 14 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లలో ఏఐ ఆధారిత డ్యుయల్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ ఫోన్లను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత హీట్‌కు గురి కావు. ఇక ఈ రెండు ఫోన్లలోనూ 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ లభిస్తున్నాయి. వీటికి ఐపీ66, 68, 69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లను అందిస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వీటికి గాను 5 మేజర్ ఓఎస్ అప్డేట్స్ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లలో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో 50 మెగాపిక్సల్ 3.5ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇక సాధారణ మోడల్లో వెనుక వైపు 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉండగా, ప్రొ మోడల్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు.
రెనో 14 ఫోన్లో 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా ప్రొ మోడల్ళో 6200 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. ఈ రెండింటికీ 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. 50 వాట్ల వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఫోన్లలోనూ పలు రకాల ఏఐ ఫీచర్లను కూడా వినియోగదారులు పొందవచ్చు. ఏఐ ఎడిటర్, ఏఐ లైవ్ ఫొటో, లైవ్ ఫొటో ఎక్స్పర్ట్ వంటి ఏఐ ఫీచర్లను ఈ ఫోన్లలో పొందవచ్చు. 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తున్నారు. ఈ రెండు ఫోన్లకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్లలో యూజర్లు పొందవచ్చు.
ఒప్పో రెనో 14 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ మోడల్ ధర రూ.39,999గా ఉంది. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.42,999గా ఉంది. అలాగే ఒప్పో రెనో 14 ప్రొ స్మార్ట్ ఫోన్ కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.49,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.54,999గా ఉంది. ఈ ఫోన్లను అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో జూలై 8వ తేదీ నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. జీరో డౌన్ పేమెంట్‌తో ఈ ఫోన్‌ను కొనే సౌకర్యం అందిస్తున్నారు.