Oppo Find X9 | స్మార్ట్ ఫోన్ తయారీ దారు ఒప్పో మరో రెండు నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రొ పేరిట ఈ ఫోన్లను లాంచ్ చేశారు. వీటిల్లో పలు అద్బుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఫైండ్ ఎక్స్9 సిరీస్ ఫోన్లను అధునాతన హార్డ్‌వేర్‌తో తీర్చిదిద్దినట్లు కంపెనీ తెలియజేసింది. ఫైండ్ ఎక్స్9 ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఒకటి 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా కాగా మరొకటి 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఇంకొకటి 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాగా ఉంది. అందువల్ల ఈ కెమెరాల సహాయంతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. అలాగే జూమ్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. ఫైండ్ ఎక్స్9 ప్రొ మోడల్లో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సల్స్ ఉండగా, టెలిఫొటో కెమెరాను కూడా 200 మెగాపిక్సల్స్ కెపాసిటీ ఉన్నది ఇచ్చారు.
ఇక ఈ ఫోన్లు చాలా తక్కువగా సీపీయూను, విద్యుత్‌ను వాడుకుంటాయని, అద్భుతమైన ప్రదర్శనను ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఫైండ్ ఎక్స్9 సిరీస్ ఫోన్ల సహాయంతో 4కె మోషన్ ఫొటోస్ను చిత్రీకరించుకోవచ్చు. ఇది ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్ అని కంపెనీ చెబుతోంది. అలాగే ప్రొ మోడల్లో ఉన్న 200 మెగాపిక్సల్ టెలిఫోటో కెమెరా ఏకంగా 13.2 ఎక్స్ వరకు జూమ్‌ను అందిస్తుందని తెలిపారు. ఇక ఈ రెండు మోడల్స్ కూడా 120ఎక్స్ వరకు సూపర్ జూమ్‌ను అందిస్తాయి. దీని వల్ల క్వాలిటీ కోల్పోకుండా ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఇక ఈ ఫోన్ల సహాయంతో 4కె రిజల్యూషన్ కలిగిన వీడియోలను 120ఎఫ్‌పీఎస్ రేట్‌తో చిత్రీకరించుకోవచ్చు. దీని వల్ల వీడియోలు అద్భుతమైన క్వాలిటీతో వస్తాయి.
ఒప్పో ఫైండ్ ఎక్స్9 ఫోన్లో 7025 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా, ఫైండ్ ఎక్స్9 ప్రొ ఫోన్లో 7500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. బ్యాటరీ వీటికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. వీటికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఈ ఫోన్లను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే 50 వాట్ల వరకు వైర్ లెస్ చార్జింగ్, 10 వాట్ల వరకు రివర్స్ వైర్లెస్ చార్జింగ్కు కూడా వీటిల్లో సపోర్టను అందిస్తున్నారు. ఈ ఫోన్లకు అందిస్తున్న డిస్ప్లేలు చాలా క్వాలిటీగా ఉంటాయి. 120 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి. అందువల్ల డిస్‌ప్లేలపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. అలాగే సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ ఫోన్లకు 3600 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్లకు ఐపీ 66, 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఫైండ్ ఎక్స్9 ఫోన్ డిస్ప్లే 6.59 ఇంచులు ఉండగా, ప్రొ మోడల్ డిస్ప్లే 6.78 ఇంచులుగా ఉంది. రెండు డిస్ప్లేలకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఫైండ్ ఎక్స్9 ఫోన్‌ను 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేయగా, ప్రొ మోడల్‌ను 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్లో లాంచ్ చేశారు. ఇక రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఫైండ్ ఎక్స్9 ఫోన్లో ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ప్రొ మోడల్లో ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ రెండు ఫోన్లలోనూ ఇన్ డిస్ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ ఫ్రా రెడ్ సెన్సార్లను ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్ 6.0, వైఫై 7, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఈ రెండింటిలోనూ అందిస్తున్నారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్9 స్మార్ట్ ఫోన్‌ను ప్పేస్ బ్లాక్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.74,999గా ఉంది. అలాగే 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.84,99గా ఉంది. ఇక ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రొ మోడల్‌ను సిల్క్ వైట్, టైటానియం, చార్ కోల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయగా ఈ ఫోన్‌కు చెందిన సింగిల్ వేరియెంట్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,09,999గా ఉంది. ఈ ఫోన్లను ప్రస్తుతం ప్రీ ఆర్డర్ చేయవచ్చు. నవంబర్ 21వ తేదీ నుంచి ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్లను కొన్నవారికి రూ.5198 విలువైన ప్రీమియం గిఫ్ట్ బాక్స్‌ను అందిస్తారు. 180 రోజుల వరకు ఉచిత హార్డ్‌వేర్ డిఫెక్ట్ రీప్లేస్ మెంట్‌ను సైతం పొందవచ్చు. 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. సున్నా డౌన్ పేమెంట్‌తో 24 నెలల వరకు ఈఎంఐ సదుపాయంతో ఈ ఫోన్‌ను కొనవచ్చు. 10 శాతం ఎక్స్ ఛేంజ్ బోనస్‌ను ఇస్తున్నారు. ఈ ఫోన్‌ను కొన్నవారికి 3 నెలల పాటు గూగుల్ ఏఐ ప్రొ 3 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనున్నారు.