న్యూఢిల్లీ : ఒప్పో ఫైండ్ ఎక్స్6, ఫైండ్ ఎక్స్6 ప్రొతో కూడిన ఫైండ్ ఎక్స్6 సిరీస్ స్మార్ట్ఫోన్లపై ఒప్పో కసరత్తు సాగిస్తోంది. అప్‌కమింగ్ ఫైండ్ ఎక్స్ సిరీస్ ఎంట్రీ డేట్‌పై కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఈ హాట్ డివైజ్‌ల కెమెరా స్పెసిపికేషన్లు, ఇతర ఫీచర్లపై టెక్ నిపుణులు లీకులు వెల్లడిస్తున్నారు.
అప్‌కమింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వెనుకభాగంలో 50ఎంపీ సోనీ కెమెరాలు కస్టమర్లను ఆకట్టుకుంటాయని లీకుల్లో వెల్లడైంది. ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రొ ఇటీవల లాంఛ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకొస్తుందని, ఒప్పో ఫైండ్ ఎక్స్6 స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను కలిగిఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒప్పో ఫైండ్ ఎక్స్6 ప్రొ మూడు 50ఎంపీ రియర్ కెమెరాలను కలిగిఉంటుందని వీబోపై టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. ఇక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్‌తో సోనీ ఐఎంక్స్989 సెన్సర్ ప్రత్యేక ఆకర్షణగా చెబుతున్నారు. దీనికి అదనంగా సోనీ ఐఎంక్స్890 సెన్సర్ ఉంటుందని లీక్స్ వెల్లడించాయి. ఇక ఇమేజింగ్ క్వాలిటీ కోసం మారిసిలికాన్ ఎక్స్ చిప్ ఉంటుందని గతంలో లీక్స్ వచ్చాయి.