OnePlus Nord CE 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ మిడ్ రేంజ్లో అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ పేరుతో ఆవిష్కరించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ బ్లూ వాయిడ్, చార్కోల్ ఇంక్, సిల్వర్ రే కలర్లలో అందుబాటులో ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6GB/128GB వేరియంట్ ధర రూ. 22,999, 8GB/128GB మోడల్ ధర రూ.24,999 కాగా 12GB/256GB వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు జూన్ 11 నుంచి వన్‌ప్లస్ స్టోర్, అమెజాన్ ఇండియాలో ప్రారంభమవుతాయి. జూన్ 16 నుంచి ఫోన్ల విక్రయాలు మొదలవుతాయి.
ముందస్తు బుకింగ్ చేసుకునే వినియోగదారులకు కొన్ని ఆఫర్లు వర్తిస్తాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల, ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రీ-ఆర్డర్లపై వినియోగదారులు అదనంగా రూ.500 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.
డిస్ప్లే: 6.43 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ
ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
రియర్ కెమెరా: 64+8+2 ఎంపీ
ర్యామ్:6జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4500mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
And that folks, is the new OnePlus Nord CE 5G
— OnePlus India (@OnePlus_IN) June 10, 2021
Follow @OnePlus_IN for more real time updates from the #OnePlusSummerLaunch Event | #OnePlusNordCE #OnePlusTVU1S pic.twitter.com/1tCKtdKroB