ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 9ఆర్టీ మోడల్ ఫోన్‌ను అక్టోబర్ 13న లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన వన్‌ప్లస్ 9ఆర్కు ఇది అప్‌గ్రేడెడ్ వర్షన్ ఫోన్. ఈ ఫోన్ హైఎండ్ ఫీచర్లతో భారత్‌లో విడుదలైంది.
వన్‌ప్లస్ 9ఆర్టీతో పాటు ఈ ఈవెంట్లో వన్‌ప్లస్ బడ్స్ జెడ్2ను కూడా విడుదల చేశారు. న్యూ ట్రులె వైర్లెస్ స్టీరియో(టీడబ్ల్యూఎస్) ఇయర్‌బడ్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్(ఏఎన్సీ) సపోర్ట్ ఉంటుంది.
వన్‌ప్లస్ 9ఆర్టీ, 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.38,600 కాగా.. 8 జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.40,900. వన్‌ప్లస్ 9ఆర్టీలో టాప్ ఎండ్ వేరియంట్ ఫోన్ ధర రూ.44,400 గా ఉంది. చైనాలో అక్టోబర్ 19 నుంచి వన్‌ప్లస్ 9ఆర్టీ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.
వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ఫోన్ ధర రూ.5800గా నిర్ణయించారు. ఇయర్‌బడ్స్ కూడా చైనాలో అక్టోబర్ 19 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. భారత్‌లో వన్‌ప్లస్ 9ఆర్టీ, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 సేల్స్ భారత్‌లో ఎప్పుడు ప్రారంభం అవుతాయో కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
6.62 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సామ్సంగ్ ఈ4 ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ ప్రైవరీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, డాల్బీ అట్మాస్ సపోర్ట్, 4500 ఎంఏహెచ్, 65టీ వార్ప్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో వన్‌ప్లస్ 9ఆర్టీ విడుదలైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Motorola Moto E40 : బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో మోటరోలా మోటో ఈ40 ఫోన్ విడుదల
Apple iPhone SE 3 : సరికొత్త ఫీచర్లతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3.. ఐఫోన్ 13కు దీటుగా
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
OnePlus 9RT : త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే