Oneplus 15R | స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. వన్ ప్లస్ 15ఆర్ పేరిట ఈ ఫోన్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ చార్క్ కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్, ఎలక్ట్రిక్ వయొలెట్ రంగుల్లో మనకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ లో 3ఎన్ ఎమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 చిప్ ను ఇచ్చారు. 12 జీబీ ఎల్ పీడీడీ ఆర్ ఎక్స్5 అల్ట్రా ర్యామ్ తో 512 జీబీ వరకు స్టోరేజ్ ను కూడా కల్పించారు. ఇక ఈ ఫోన్ వెనుక 50 మెగాపిక్సల్ కెమెరా, ముందు వైపు32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 7,400 ఎంఎహెచ్ బ్యాటరీతోపాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంది.
కొత్తగా విడుదల చేయబడిన వన్ ప్లస్ 15ఆర్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ కు 4 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్ ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఈ ఫోన్ 165 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ను ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణను కలిగి ఉంది. వన్ ప్లస్ 15ఆర్ 6.83 అంగుళాల పొడవుతో ఫుల్ హెచ్డీ డిస్ప్లే ను కలిగి ఉంది. అంతేకాకుండా అవుట్ డోర్ వ్యూయింగ్, రిడ్యూస్ వైట్ పాయింట్, మైషన్ క్యూస్, ఐ కంఫర్ట్ రిమైండర్ ల కోసం స్క్రీన్ సన్ డిస్ప్లే ను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ జి2 వైఫై చిప్, టచ్ రెస్పాన్స్ చిప్ ను కూడా కలిగి ఉంది. ఇందులో ఐపీ 66, 68,69, 69కె డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ లో ఫ్లాగ్ షిప్ వన్ ప్లస్ 15 లాగానే డిటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ ఉంది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్906 ప్రైమరీ షూటర్ ను కలిగి ఉండగా, 112 డిగ్రీల ఫీల్ట్ ఆఫ్ వ్యూతో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. దీంతో వినియోగదారులు 120 ఎఫ్పీఎస్ వరకు 4కె రిజల్యూషన్ వీడియోలను షూట్ చేసుకోవచ్చు.
వన్ ప్లస్ 15 ఆర్ 12జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 47,999 ఉండగా, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ. 52,999 గా ఉంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ కార్డ్ లపై డిస్కౌంట్ ను కంపెనీ అందిస్తుంది. ఇక ఈ రోజు నుండి ఫ్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. వచ్చేవారం నుండి అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు కూడా చేయవచ్చు.