న్యూఢిల్లీ : రాబోయే నెలల్లో పలు ప్రోడక్ట్లను ప్రవేశపెట్టేందుకు వన్‌ప్లస్ కసరత్తు సాగిస్తోంది. అందుబాటు ధరలో లభించే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీతో పాటు నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్‌గా చెబుతున్న వన్‌ప్లస్ 11 సిరీస్‌నూ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు ముమ్మరం చేసింది. వన్‌ప్లస్ 11 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11 ప్రొను తీసుకువచ్చేందుకు వన్‌ప్లస్ కసరత్తు సాగిస్తోంది.
వన్‌ప్లస్ 11 లాంఛ్‌కు ముందే ఈ హాట్ డివైజ్‌ల స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ పలు లీక్‌లు ముందుకొచ్చాయి. డిజిటల్ చాట్ స్టేషన్ అంచనా ప్రకారం ఒప్పో ఫైండ్ ఎన్2ను పోలిన కెమెరా ఫీచర్లు వన్‌ప్లస్ 11 ఆఫర్ చేస్తుందని చెబుతున్నారు. వన్‌ప్లస్ 11 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరాతో పాటు 48 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 32 ఎంపీ సోనీ ఐఎంఎక్స్709 టెలిఫొటో కెమెరాతో ఈ డివైజ్ కస్టమర్ల ముందుకు రానుంది.
ఈ కెమెరా సెటప్ 2x ఆప్టికల్ జూమ్‌ను అందించే వెసులుబాటు కల్పిస్తుంది. వన్‌ప్లస్ 11 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగిఉంటుందని లీకులు వెల్లడిస్తున్నాయి. ఇక వన్‌ప్లస్ 11 ప్రొ 6.7 ఇంచ్ అమోల్డ్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టం, 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.