OnePlus 10R| చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 10ఆర్ పేరుతో విడుదల కానున్న ఆ ఫోన్ హైఎండ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. ఈ ఫోన్‌ను చైనాతో పాటు భారత్‌లో ఒకేసారి 2022 మొదటి ట్రైమాసికం ముగిశాక.. రెండో త్రైమాసికంలో వన్‌ప్లస్ లాంచ్ చేయనుంది. అంటే.. ఏప్రిల్ 2022 తర్వాత ఈ ఫోన్ లాంచ్ కానుంది.
ఇప్పటికే వన్‌ప్లస్ 10 ప్రో ఫోన్ చైనాలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. మార్చి 2022లో వన్‌ప్లస్ 10 ప్రో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 10ఆర్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది.
అలాగే.. ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. వన్‌ప్లస్ 10 ఆర్తో పాటు వన్‌ప్లస్ టీవీ కూడా త్వరలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ టీవవీ వై1ఎస్ మోడల్ టీవీ త్వరలో భారత్‌లో రిలీజ్ కానుంది. ఈ టీవీ రూ.25 వేల ధరలోపే లభించనున్నట్టు సమాచారం. అయితే.. వన్‌ప్లస్ టీవీలో ఉండే ఫీచర్ల గురించి మాత్రం కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.