Nothing Phone 3 | తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను రిలీజ్ చేయడంలో నథింగ్ కంపెనీ పేరుగాంచింది. మార్కెట్లో ప్రవేశించిన కొద్దికాలంలోనే కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు అధునాతన ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక తాజాగా మరో స్మార్ట్ ఫోన్‌ను ఆ కంపెనీ లాంచ్ చేసింది. నథింగ్ ఫోన్ 3 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లేటెస్ట్గా లాంచ్ చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఫ్లాగ్షిప్ రేంజ్ కస్టమర్ల కోసం ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచుల 1.5కె అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. అద్భుతమైన దృశ్యాలను ఈ ఫోన్ తెరపై వీక్షించవచ్చు.
సూర్యకాంతిలోనూ ఫోన్ తెర స్పష్టంగా కనిపించేలా 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్4 ప్రాసెసర్‌ను అమర్చారు. 16జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తుండగా 5 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 7 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌కు గాను ఒక ఎసెన్షియల్ కీ ని ఇచ్చారు. దీని సహాయంతో ఫోన్ ద్వారా సులభంగా రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎసెన్షియల్ సెర్చ్, ఫ్లిప్ టు రికార్డ్, ఎసెన్షియల్ స్పేస్ వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇక నథింగ్ ఫోన్లకు వెనుక వైపు ఉండే గ్లిఫ్లను ఈ ఫోన్లో అందివ్వడం లేదు. బదులుగా సరికొత్త గ్లిఫ్ మాట్రిక్స్‌ను ఇచ్చారు. ఇది ఒక మైక్రో ఎల్ఈడీ డిస్క్‌లా పనిచేస్తుంది. దీనిపై యూజర్లకు డిజిటల్ క్లాక్, సోలార్ క్లాక్, స్టాప్ వాచ్, బ్యాటరీ లెవల్స్, కంపాస్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అలా దీన్ని సెట్ చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 3 వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. అలాగే మరో 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సల్ 3ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు వైపు సైతం 50 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాలు అన్నింటితో అద్బుతమైన 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 65 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. కేవలం 54 నిమిషాల్లోనే ఫోన్ చార్జింగ్ పూర్తవుతుంది. 15 వాట్ల వరకు వైర్లెస్ చార్జింగ్ సదుపాయం కల్పించారు. 5 వాట్ల వరకు రివర్స్ వైర్లెస్ చార్జింగ్ చేసుకోవచ్చు. 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇక నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లాంచ్ కాగా ఈ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.79,999గా ఉంది. అలాగే 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,999గా ఉంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ మోడల్స్‌ను రూ.62,999, రూ.72,999 ధరలకు కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలియజేసింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ తోపాటు ఇతర రిటెయిల్ స్టోర్స్‌లో జూలై 15 నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకుంటే మరో ఏడాది అదనపు వారంటీ లభిస్తుంది. అలాగే 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే సౌలభ్యం అందిస్తున్నారు.