మంగళవారం 19 జనవరి 2021
Science-technology - Nov 28, 2020 , 16:16:33

నోకియా స్మార్ట్‌టీవీలు వచ్చేశాయ్‌!

నోకియా స్మార్ట్‌టీవీలు  వచ్చేశాయ్‌!

ముంబై:  ప్రముఖ టెక్నాలజీ కంపెనీ  నోకియా స్మార్ట్‌టీవీల విభాగంలోకి ప్రవేశించింది.  యూరప్‌లో నూతన  శ్రేణి స్మార్ట్ టీవీలను   ఆవిష్కరించేందుకు   స్ట్రీమ్‌వ్యూతో నోకియా జతకట్టింది.  నోకియా  4K ఎల్‌ఈడీ స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ టీవీలను మార్కెట్లోకి రిలీజ్‌ చేసింది.    సుమారు 1.2లక్షల ప్రారంభ ధరతో తీసుకొస్తున్న టీవీలను ముందుగా యూరప్‌లోని కొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు.  75 అంగుళాలు కలిగిన స్మార్ట్‌టీవీ డాల్బీ విజన్‌, HDR10 సపోర్ట్‌తో  4K UHD రిజల్యూషన్‌ కలిగి ఉంది.   నోకియా స్మార్ట్‌టీవీ 32-, 43-, 50-, 55-, 65 అంగుళాల టీవీలను స్ట్రీమ్‌వ్యూ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ టీవీ స్పెసిఫికేషన్లు:

డిస్‌ప్లే: 75 అంగుళాలు

రిజల్యూషన్‌: 4కే

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌

స్మార్ట్‌టీవీ: అవును