Nokia G60 | దేశీయ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా మార్కెట్లోకి 5జీ స్మార్ట్ ఫోన్ జీ- 60 తీసుకొచ్చింది. 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా ఇందులో లభ్యం అవుతుంది. ఈ ఫోన్ పూర్తిగా 5జీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో 6.58-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది.
50మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌లో పవర్ఫుల్ కెమెరా లభ్యం అవుతుంది. 5-మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లభిస్తాయి. వీటితోపాటు 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభ్యం అవుతుంది. బ్లాక్, ఐస్ కలర్ వేరియంట్లలో నోకియా జీ-60 మార్కెట్లో దొరుకుతుంది.
6జీబీ రామ్‌తోపాటు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటుంది. నోకియా జీ-60 ఫోన్ 6.5-అంగుళాల డిస్ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120హెర్ట్జ్, 1080×2400 పిక్సెల్స్‌తో కూడిన ఫుల్ హెచ్డీ రిజొల్యూషన్ లభిస్తుంది. స్క్రీన్‌పై గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది.
నోకియా జీ-60 5జీ ఫోన్ 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 20వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్‌కు బ్లూటూత్ 5.1, 3.5ఎంఎం జాక్, టైప్-సీ పోర్ట్, డ్యుయల్ బాండ్ వై-ఫై కనెక్టివిటీ ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలు దారులకు రూ.3,599 విలువ గల నోకియా పవర్ ఇయర్ వర్డ్స్ ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.