హైదరాబాద్ : ట్విట్టర్ తన సేఫ్టీ మోడ్ ఫీచర్ బీటా వెర్షన్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరులో ప్రారంభంలో రూపొందించిన సేఫ్టీ మోడ్, మీకు హానికరమైన లేదా దుర్వినియోగమైన ట్వీట్లను ఆటోమేటిక్ గా పంపే ఖాతాలను బ్లాక్ చేయడానికి ఈ ఆప్షన్ అనుమతిస్తుంది. గతంలో సేఫ్టీ మోడ్ సుమారు 750 మంది బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇది అమెరికా, యూకే , కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్‌లలో 50 శాతం మందికి విస్తరించనున్నదని ట్విట్టర్ ప్రతినిధి టటియానా బ్రిట్ తెలిపారు.
ట్విట్టర్ ప్రోయాక్టివ్ సేఫ్టీ మోడ్ ప్రాంప్ట్‌లను కూడా పరిచయం చేస్తోంది. “సెప్టెంబర్‌లో సేఫ్టీ మోడ్ బీటా ప్రారంభమైనప్పటి నుంచి, కొంతమంది వ్యక్తులు అనుమతి లేనిఖాతాలను గుర్తించడంలో సహాయం కావాలని మేము తెలుసుకున్నాము” అని బ్రిట్ చెప్పారు. “ఈ కారణంగా, మా సాంకేతికత ఇప్పుడు హానికరమైన ప్రత్యుత్తరాలను ముందస్తుగా గుర్తిస్తుంది. ఈ అప్డేట్ అన్ వాంటెడ్ యాక్టివిటీస్ భారాన్ని మరింత తగ్గిస్తుంది.