motorola razr 60 ultra | మోటోరోలా సంస్థ మరో నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రేజర్ 60 అల్ట్రా పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో ఏకంగా 7 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. దీనిని లోపలి వైపుకు మడవచ్చు. ఎల్టీపీవో పీఓలెడ్ డిస్ప్లే కావడం, 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండడంతో ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఫోన్‌కు మరో వైపు 4 ఇంచుల పీఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. ఇది కూడా 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అలాగే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను సైతం అందిస్తున్నారు.
ఈ ఫోన్లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతోపాటు 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు కూడా 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో మోటో ఏఐ ఫీచర్లను అందిస్తున్నారు. మోటో ఏఐ ప్రాంప్ట్స్, క్యాచ్ మి అప్, పే అటెన్షన్, రిమెంబర్ దిస్ వంటి ఫీచర్లను యూజర్లు పొందవచ్చు. ఏఐ కోసం ప్రత్యేకంగా ఒక బటన్‌ను ఏర్పాటు చేశారు. దీని సహాయంతో చాలా సులభంగా ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 68 వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. 30 వాట్ల వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
16 జీబీ ర్యామ్‌ను ఈ ఫోన్లో పొందవచ్చు. 512 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. 3 ఏళ్ల వరకు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. డ్యుయల్ సిమ్ ను వేసుకోవచ్చు. యూఎస్బీ టైప్ సి ఆడియోను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తోపాటు 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
మోటోరోలా రేజర్ 60 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను పాంటోన్ స్కరబ్, పాంటోన్ రియో రెడ్, పాంటోన్ మౌంటెయిన్ ట్రయల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.99,999 ఉండగా పలు లాంచింగ్ ఆఫర్లను అందిస్తున్నారు. దీంతో ఫోన్‌ను రూ.89,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌తోపాటు మోరోటోలా అన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను మే 21 నుంచి విక్రయించనున్నారు.